సరికొత్త 'హీరో డెస్టిని 125' స్కూటర్‌ను విడుదల చేసిన హీరో మోటోకార్ప్!

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్..telugu latest news

Update: 2022-03-31 17:12 GMT

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గురువారం తన సరికొత్త 'హీరో డెస్టిని 125 ఎక్స్‌టెక్' స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ. 69,900(ఎక్స్‌షోరూమ్-ఢిల్లీ)గా నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 125సీసీ ఇంజిన్‌తో వచ్చిన ఈ స్కూటర్ స్టాండర్డ్ వేరియంట్ రూ. 69,900 అని, టాప్ ఎండ్ వేరియంట్ రూ. 79,900గా ఉందని పేర్కొంది. దేశీయ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ సరికొత్త స్కూటర్‌లో అత్యాధునిక ఫీచర్లను అందించామని కంపెనీ తెలిపింది. మఫ్లర్ ప్రొటెక్టర్, హెడ్‌ల్యాంప్ సరౌండ్, హ్యాండిల్‌బార్‌పై క్రోమ్ యాక్సెంట్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు సరికొత్త బ్లూటూత్ కనెక్టివిటీ వంటి పలు కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్కూటర్ నెక్సస్ బ్లూ షేడ్ కలర్‌తో పాటు మాట్ బ్లాక్, పెరల్ సిల్వర్ వైట్, నోబెల్ రెడ్, పాంథర్ బ్లాక్, బ్రౌన్, మాట్ రే సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. 'డెస్టినీ 125 స్కూటర్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. మెరుగైన రైడింగ్ సౌకర్యంతో పాటు కొత్త టెక్నాలజీ ఆకర్షిస్తుంది. భద్రత, స్టైలింగ్‌లో రాజీ పడకుండా ఈ స్కూటర్‌ను రూపొందించామని&' హీరో మోటోకార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ అన్నారు.

Tags:    

Similar News