ఎల్అండ్‌టీ ఫైనాన్స్‌తో హీరో ఎలక్ట్రిక్ ఒప్పందం!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్..telugu latest news
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ తన వినియోగదారులకు సులభమైన ఫైనాన్స్ సౌకర్యాలను అందించేందుకు ఎల్అండ్‌టీ ఫైనాన్స్‌తో కీలక ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కేవలం 3 నిమిషాల్లోగా వాహనాలను కొనుగోలు చేయవచ్చని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్అండ్‌టీ భాగస్వామ్యంతో 7.99 శాతం తక్కువ వడ్డీకే తక్కువ సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల రుణాలకు ఆమోదం లభిస్తుందని హీరో ఎలక్ట్రిక్ వివరించింది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు కస్టమర్ల నుంచి గణనీయమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం తమ భాగస్వామ్యంతో రానున్న రోజుల్లో టైర్2 మార్కెట్లకు హీరో ఎలక్ట్రిక్‌ను విస్తరించాలని, దీనికోసం వినియోగదారులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రుణ సౌకర్యం పొందడానికి తాజా ఒప్పందం ఎంతో దోహదపడుతుందని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ అన్నారు. కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులో వినియోగదారులకు మెరుగైన ప్రయోజనాలను అందిస్తోందని, దీనివల్ల కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన పేర్కొన్నారు.