Mahesh Babu: ఆయన ఎప్పుడూ నాకు అండగానే ఉంటారు.. స్టార్ హీరోపై యంగ్ హీరో ప్రశంసలు

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’

Update: 2024-11-20 15:39 GMT

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి.. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కథ అందించారు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ మూవీలో మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. పాజిటివ్ అంచనాల మధ్య ఈ మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నవదళపతి సుధీర్ బాబు స్పెషల్ గెస్ట్‌లుగా పాల్గొన్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన అందరికీ థాంక్యూ సో మచ్. కష్టపడితే ఏదైనా మనకి వస్తుందని సుధీర్ బాబు (Sudhir Babu) చూసి నేర్చుకున్నాను. అదే నన్ను ముందుకు నడిపిస్తుంది. ప్రశాంత్ వర్మ ఒక సినిమాతో వస్తున్నారంటే అది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ ఇచ్చారు. డెఫినెట్‌గా ఇది ఇంట్రెస్టింగ్, ఎక్సయిటింగ్‌గా ఉంటుంది. మహేష్ బాబు (Mahesh Babu), ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. మీ అందరినీ అలరించడానికి లుక్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. అందుకే ఈ ఈవెంట్‌కి రాలేకపోయారు. ఆయన ఈ వేడుకలో లేకపోయినా ఆయన ఎప్పుడూ నాకు అండగానే ఉంటారు. ఆయన చెయ్యి ఎప్పుడూ నా భుజం మీద ఉంటుంది. అందులో డౌట్ లేదు. మా సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. మీరు డెఫినెట్‌గా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈ సినిమాతో మీ ప్రేమ అభిమానం, నాకు కూడా కొంచెం వస్తుందని ఆశిస్తున్నాను. థాంక్యూ. నవంబర్ 22 థియేటర్స్‌లో కలుద్దాం’ అని తెలిపాడు. 

Tags:    

Similar News