JC Prabhakar Reddy: పోలీసులపై నాకు నమ్మకం లేదు.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు
తన బస్సులు దగ్ధంపై టీడీపీ సీనీయర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (జేసీ ప్రభాకర్ రెడ్డి) పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తన బస్సులు దగ్ధంపై టీడీపీ సీనీయర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బస్సుల దగ్ధం కేసులో పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సులు షాట్ సర్య్కూట్‌తో తగలబడలేదని.. పక్కా పథకం ప్రకారమే కావాలనే తగులబెట్టారని బూతులతో విరుచుకుపడ్డారు. వాళ్లెవరో కనిపెట్టే దమ్ము, ధైర్యం పోలీసులకు అసలు ఉందా అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థపై తనకు నమ్మకం పోయిందని.. పోలీసు ఉన్నతాధికారులకు న్యాయం చేయడం చేతకాదని ఫైర్ జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.
Also Read..
మాధవి లతపై ఫిర్యాదు.. బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు