TTD Chairman : వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్

Update: 2025-01-05 07:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala)లోవైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadasi Vaikuntha Dwaram from January 10-19) సందర్భంగా భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు(TTD Chairman BR. Naidu) పరిశీలించారు. మాడవీధుల్లో భక్తుల కోసం జరుగుతున్న ఏర్పాట్లను, గ్యాలరీలో ఉన్న షెడ్లను పరిశీలించారు. శ్రీవారి భక్తులకు జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని నాయుడు సూచించారు. దర్శనం టికెట్లు ఉన్న వారిని మాత్రమే ఈ పది రోజులు పాటు తిరుమలకు అనుమతిస్తామన్నారు.

సుమారు 7లక్షల మంది దర్శనాలు చేసుకుంటారని అంచనా వేస్తున్నామని, సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. వీఐపీ భక్తులకు పార్కింగ్​కు ఇబ్బంది ఎదురవకుండ ఏర్పాట్లు చేశామని, టికెట్​ లేకుండా ఎవరూ దర్శనానికి రాకూడదని స్పష్టం చేశారు. జనవరి 10, 11, 12వ తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తారన్నారు.

Tags:    

Similar News