అతనో పారిశుద్ధ్య కార్మికుడు కానీ.. యూపీ ఎన్నికల్లో భారీ విజయం

దిశ, వెబ్ డెస్క్: నిన్న మొన్నటి వరకు అతను ఒక పారిశుద్ధ్య కార్మికుడు. కానీ ప్రస్తుతం ఓ అసెంబ్లీ నియోజకవర్గానికి latest telugu news..

Update: 2022-03-14 06:21 GMT

దిశ, వెబ్ డెస్క్: నిన్న మొన్నటి వరకు అతను ఒక పారిశుద్ధ్య కార్మికుడు. కానీ ప్రస్తుతం ఓ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో నెలకొంది. వివరాల్లోకి వెళితే.. చౌహాన్ అనే రిక్షా కార్మికుడు యూపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సాధారణ కార్యకర్త ఉన్న ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బీజేపీ పెద్ద సాహసమే చేసిందని చెప్పుకోవాలి. అయితే ఈ ఎన్నికల్లో చౌహాన్ సంత్ కబీర్ నగర్ జిల్లాలోని ధన్‌ఘటా స్థానం నుంచి పోటీ చేశాడు. అనూహ్యంగా నియోజకవర్గం ప్రజలు చౌహాన్ ను ఆదరించడం జరిగింది. పారిశుద్ధ్య కార్మీకుడైన చౌహాన్ 10,553 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

తనకు ఇంతటి విజయాన్ని అందించినందుకు గాను.. చౌహాన్ భావోద్వేగానికి గురయ్యారు. అలాగే తను మాట్లాడుతూ.. కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో నేను రిక్షా పుల్లర్ల కోసం పూరీ-సబ్జీ ని తీసుకు వెళ్లేవాడిని. వారు బీహార్ నుంచి ఇక్కడకు వచ్చి.. కబీర్ నగర్ లో నివసిస్తున్నారు. నాకు టికెట్ వచ్చినప్పుడు, వారు నన్ను కలవడానికి వచ్చి భావోద్వేగానికి గురయ్యారు. అలాగే నేను గెలిచిన రోజు రిక్షా కార్మికులు వచ్చి అభినందించి నన్ను కౌగిలించుకున్నారు. అని చౌహాన్ చెప్పారు. ఈ ఎన్నికల్లో అతను 83, 241 ఓట్లు పొంది విజయం సాధించారు.

Tags:    

Similar News