బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారా.. టైం వేస్ట్ వ్యవహారాలతో పాటు..?
కష్టసుఖాల్లో తోడుండేవాడు నిజమైన ఫ్రెండ్ అని చెప్పుకుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: కష్టసుఖాల్లో తోడుండేవాడు నిజమైన ఫ్రెండ్(true friend) అని చెప్పుకుంటారు. ఇతరులు నాకు ఇంత మంది మిత్రులున్నారు.. అంత మంది ఉన్నారని చెబుతున్నప్పుడు మనకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అప్పుడు అయ్యో నాకు ఇంతే మంది స్నేహితులున్నారే అని కొంతమంది బాధపడుతుంటారు. కానీ ఈ విషయంలో ఎలాంటి బాధ అక్కర్లేదంటూ తాజాగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్స్(Close friends) ఎక్కువగా ఉంటే నష్టాలే తప్ప.. లాభాలేం లేవంటున్నారు నిపుణులు.
బెస్ట్ ఫ్రెండ్స్ ను మెయింటైన్ చేయాలంటే తప్పకుండా వారి కోసం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. వారిపై ప్రేమతో కొంతమంది.. ఫీల్ అవుతారేమోనని మరికొంతమంది తమ సమయాన్ని వృథా చేసుకుని వారితో గడుపుతుంటారు. దీంతో మీ ప్రొడక్టివిటీ(Productivity) తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే మీరు ఒకరితో క్లోజ్ అయ్యాక.. వేరే స్నేహితులతో మాట్లాడిన వారు ఫీల్ అవుతుంటారు. అనుమానాలు, అపార్థాలు వస్తాయి. దీని కారణంగా మీరు మానసికంగా ప్రశాంతంగా(Mentally calm) ఉండలేరు. అనవసరంగా ఒత్తిడి(stress)కి లోనవుతారు.
అయితే ఒక్కరితో స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ కొనసాగించొచ్చు. కానీ ఒకేసారి పది లేదా అంతకంటే ఎక్కువమంది అంటే కష్టంగా ఉంటుంది. మిత్రులు ఎక్కువైతే ఆ కష్టాన్ని ప్రతీసారి భరించాల్సి ఉంటుంది. నో చెప్పినా ప్రాబ్లమే. అలాగే ప్రైవసీ(Privacy) విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది. ఒక్కరిద్దరికి అయితే వ్యక్తిగత విషయాలు పంచుకుంటారు. కానీ ఎక్కువమంది ఉంటే ఆటోమేటిక్‌గా అన్ని ముచ్చట్లు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కాగా మీ పర్సనల్ విషయాలు దాచిపెట్టడానికి కష్టమవుతుంది. కాబట్టి ఎక్కువ మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే ఎక్కువగా నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తక్కువ మందితోనే స్నేహం కొనసాగిస్తే జీవితంలో విజయం సాధించగలరని సూచిస్తున్నారు.