Bigg Boss 8 Telugu Promo: డేంజర్ జోన్‌లో ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు.. ఇంటికెళ్లనున్నదెవరు?
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో అట్టహాసంగా సాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున(Nagarjuna) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో(Bigg Boss reality show) అట్టహాసంగా సాగుతోంది. వారమంతా కంటెస్టెంట్ల ఆటతీరుకు నాగార్జున రివ్యూ ఇచ్చారు. దీంతో కంటెస్టెంట్ల అంతా కాస్త మూడ్ ఆఫ్‌లో ఉండగా.. కూల్ అవ్వడం కోసం ఆదివారం నాడు సండే ఫన్ డే(Sundayfun day) అనే అని ఓ టాస్క్ నిర్వహించాడు బిగ్ బాస్. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇకపోతే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ ప్రేక్షకుల్లో సస్పెన్స్ నెలకొంది. అయితే డేంజర్ జోన్‌లో ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. తాజా ప్రోమో చూసినట్లైతే.. ఫైనల్‌గా బిగ్ బాస్ -8 లో హరితేజ(Hariteja), నయన పావని(Nayani Pavani) ఉన్నారు. ఇక నాగార్జున సుత్తితో అక్కడ ఉన్న పలకల్ని సుత్తితో పగలకొడితే పావని లేదా హరితేజనా ఎలిమినేట్ అయ్యేదని తెలిసిపోతుంది.
ఇక టాస్కుల ఆడటంతో, ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడంలో హరితేజ బెస్ట్ అంటున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు. నయని పావని చీటికి మాటికి ఏడుస్తుందని జనాల టాక్. ఇక ఈ ప్రోమోలో నాగార్జున టాస్క్ గురించి మాట్లాడారు.కాకరకాయ జ్యూస్ ఇంకోక జ్యూస్ కలుపుతాడు నబీల్(Nabeel). ఇక జ్యూస్ ఎవరికి ఇస్తాడనేది అంతా ఆసక్తిగా చూస్తారు. నబీల్.. విష్ణుప్రియ(Vishnu Priya)కు ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అవినాష్(Avinash) కు ఇవ్వడంతో అంతా షాక్ అవుతారు. దీనికి నబీల్ కారణం కూడా చెప్పబోతుంటే అవినాష్ కల్పించుకుని ఆపేస్తాడు. నాగార్జున నబీల్ ను కారణం ఏంటి? అని అడుగుతాడు. అప్పుడు.. జీబ్రా రూమ్‌లో దీపావళి బాంబులు వేసి టాక్సిసిటీ పెంచేస్తున్నాడు అంటూ అవినాష్ సీక్రెట్ బయటపెట్టాడు నబీల్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.