కామినేని టూ కిమ్స్ @ 16 మినిట్స్.. అవయవ మార్పిడి కోసం గ్రీన్ ఛానల్

దిశ, ఎల్బీనగర్: సకాలంలో అవయవ మార్పిడి కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు రాచకొండ ట్రాఫిక్..Green channel for organ transplantation

Update: 2022-03-08 06:01 GMT

దిశ, ఎల్బీనగర్: సకాలంలో అవయవ మార్పిడి కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు. మంగళవారం బ్రెయిన్ డెడ్ కు గురైన ఓ వ్యక్తి అవయవాలు ( గుండె, ఊపిరితిత్తులు) ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేట్‌లోని కిమ్స్ హాస్పటల్‌కు తరలించేందుకు అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. దీంతో రాచకొండ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కేవలం 16 నిమిషాల్లో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ఉదయం 10.01 గంటలకు ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ నుంచి బయల్దేరిన అంబులెన్స్‌కు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. దీంతో 10 గంటల 17 నిమిషాలకు అంబులెన్స్ కిమ్స్ హాస్పిటల్ కు చేరుకుంది. 17.6 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 16 నిమిషాల్లో చేరుకునేలా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి.. సేవలందించిన రాచకొండ ట్రాఫిక్ పోలీసులను హాస్పిటల్స్ యాజమాన్యం, రాచకొండ సీపీ మహేష్ భగవత్ అభినందించారు.

Tags:    

Similar News