అరుదైన ఫొటో రిలీజ్ చేసిన ప్రభుత్వం..
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వం అత్యంత అరుదైన ఫొటోను రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని ఈ ఫొటో..
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వం అత్యంత అరుదైన ఫొటోను రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. భారత్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అధికారికంగా విడుదలైన మొట్టమొదటి స్టాంప్ ఫొటోను భారత్ ప్రభుత్వం ప్రజలతో గురువారం పంచుకుంది. ఇన్నాళ్లు బయటకు రాని ఈ ఫొటోను ప్రభుత్వం 'మూమెంట్ విత్ తిరంగ' కాంపెయిన్‌లో భాగంగా విడుదల చేసింది. అయితే స్వతంత్ర భారత తొలి స్టాంపును 1947 నవంబర్ 21న ప్రకటించారు. దీని విలువ మూడున్నర అనాలు అని ప్రభుత్వ ఫొటోతో సహా తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ స్టాంప్‌పై భారత జాతీయ పతాకంతో పాటు జైహింద్ అని ఉంది. దాంతో పాటుగా మరో వైపు దేశం స్వాతంత్ర్యం సాధించిన ఆగస్టు 15 తేదీ ముద్రించి ఉంది.
#DidYouKnow : the 1st Stamp of Independent India was issued on November 21, 1947 and was valued at three & a half annas! 🇮🇳 #AmritMahotsav #MomentsWithTiranga #HarGharTiranga #IndiaAt75 pic.twitter.com/TxSah0Viju
— MyGovIndia (@mygovindia) July 21, 2022