కొవిడ్-19 'కాలర్ ట్యూన్'ను ఆపివేయనున్న ప్రభుత్వం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా ప్రజల కాలర్ ..telugu latest news
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా ప్రజల కాలర్ ట్యూన్ ఒక్కటే అదే "దవాయి భీ, కడాయి భీ (ఔషధం, జాగ్రత్త రెండూ)" అనే అంశంతో కరోనా గురించి జాగ్రత్తలు చెప్తూ వచ్చే వాయిస్ ఓవర్. కరోనా వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వ్యాక్సిన్, జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి ఈ కాలర్ ట్యూన్‌ను తెచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రజలు ఎవరికి ఫోన్ చేసిన మొట్టమొదట కరోనా గురించి అనౌన్స్‌మెంట్ వినపడుతుంది. ప్రజలు ఇతరులకు కాల్ చేసినప్పుడల్లా ఒకే కాలర్ ట్యూన్‌ను పదే పదే వినవలసి రావడంతో అసౌకర్యంగా ఉండేదని, కాల్‌లు కనెక్ట్ కావడానికి కూడా ఎక్కువ సమయం పడుతుందని తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.
అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో దాదాపు రెండు సంవత్సరాల పాటు వ్యాధి గురించి అవగాహన కల్పించిన COVID-19 ప్రీ-కాల్ అనౌన్స్‌మెంట్‌లను ఆపివేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కాలర్ ట్యూన్ ఎప్పడు ఆపివేస్తారొ ఖచ్చితమైన తేదీని వెళ్లడించనప్పటికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ప్రభుత్వం త్వరలోనే దీనిపై ఒక నిర్ణయానికి రానుంది. కొవిడ్-19 కాలర్ ట్యూన్‌ను రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టారు. దీనికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఒవర్ చెప్పారు. తరువాత జనవరి 2021లో, కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి కాలర్‌లను హెచ్చరించే "ఫిమేల్ వాయిస్" వచ్చింది.