Viswam: గోపీచంద్ ' విశ్వం' మూవీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మాస్ సాంగ్

హీరో గోపీచంద్ - శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘విశ్వం’.

Update: 2024-10-11 06:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : హీరో గోపీచంద్ - శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘విశ్వం’. ఈ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందింది. నేడు ‘విశ్వం' మూవీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. అన్నీ చోట్లా మిక్స్డ్ టాక్ తో దూసుకెళ్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంయుక్తంగా కలిసి నిర్మించారు.

గురువారం ఈ సినిమా నుంచి మాస్ సాంగ్ ను విడుదల చేసారు. 'గుంగురు గుంగురు పార్టీ' అంటూ సాగే ఈ పాటను యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియా కంపోజ్ చేశారు. కానీ, ఈ ఒక్క పాట మాత్రం మేకర్స్ స్పెషల్ గా కంపోజ్ చేయించారు. ఈ సాంగ్ లో  గోపీచంద్, కావ్యా థాపర్ మాస్ వేసిన మాస్ స్టెప్పులు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. సినిమా చూసిన ఆడియెన్స్ ప్రత్యేకంగా చెప్పడం విశేషం.

అలాగే, కావ్య థాపర్ అయితే తన అందాలను ఆరబోసింది. భీమ్స్ పాడిన ఈ పాటకు సురేశ్‌ గంగుల సాహిత్యం అందించారు. ప్రస్తుతం, ఈ మాస్ పాట నెట్టింట ట్రెండ్ అవుతుంది.

Full View

Tags:    

Similar News