అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్టార్ట్ అయిన చైతన్య- శోభితల పెళ్లి పనులు.. ఫొటోలు వైరల్

అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-10-21 08:17 GMT

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున X వేదికగా ప్రకటిస్తూ వీరిద్దరి నిశ్చితార్ధ ఫొటోలను షేర్ చేశాడు. కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనేది మాత్రం వెల్లడించలేదు. దీంతో అక్కినేని అభిమానులు చై- శోభితల మ్యారేజ్ ఎప్పుడెప్పుడు అవుతదా అని అప్పటినుంచి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ గుడ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

తాజాగా శోభిత ధూళిపాళ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో కనకాంబరం కలర్ చీర కట్టుకొని సంప్రదాయకంగా రెడీ అయి ఫొటోలకు పోజులిచ్చింది. అంతేకాకుండా ‘గోధుమ రాయి పసుపు దంచడం.. అలాగే ఇది ప్రారంభమైంది’ అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో అక్కినేని అభిమానులు చైతన్య- శోభితల పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయని తెగ సంబర పడిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. కంగ్రాట్స్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా మ్యారేజ్ డేట్ అయితే ప్రకటించకపోవడం గమనార్హం.

Read More : సమంత ఆ భాష మాట్లాడటం చూసి షాక్ అయ్యాను.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు.

అక్కినేని ఫ్యామిలీలో పేర్లకు ముందు నాగ అని ఎందుకు ఉంటుందో తెలుసా..? అఖిల్‌కు లేకపోవడానికి కారణం అదే..!

Full View

(video link credits to shobhitha dhulipala instagram id)


Similar News