తక్కువ మనీతో ఎక్కువ ఎంజాయ్.. కపుల్ గోల్స్‌కు సరైన చోటు!

దిశ, ఫీచర్స్: ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన సముద్ర తీరాలు, సరదాలు పంచే కార్నివాల్స్, నోరూరించే సీఫుడ్స్, ఆకట్టుకునే కలోనియల్-యుగం నాటి శిల్పసంపద, లోటే లేని మత్తెక్కించే మధుపానీయాలు.

Update: 2022-03-14 10:17 GMT

దిశ, ఫీచర్స్: ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన సముద్ర తీరాలు, సరదాలు పంచే కార్నివాల్స్, నోరూరించే సీఫుడ్స్, ఆకట్టుకునే కలోనియల్-యుగం నాటి శిల్పసంపద, లోటే లేని మత్తెక్కించే మధుపానీయాలు. ఇలా చెప్పుకుంటూ పోతే గోవా వెళ్లేందుకు బోలెడు కారణాలు. ఏ సీజన్‌లోనైనా రారమ్మని పిలిచే గోవా అందాలు టెంప్ట్ చేస్తున్నా.. తగినంత ప్రణాళిక, పరిశోధన లేకుండా ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంలో తనివితీరా ఎంజాయ్ చేయడం ఖరీదైన వ్యవహారమే. అన్ని ప్రదేశాలు కవర్ చేయాలన్నా, మంచి ప్లేస్‌లో బస చేయాలన్నా కష్టమే. అందుకే తదుపరి ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ హాస్టల్స్, లాడ్జీలు సెలక్ట్ చేసుకోండి. ఇందుకు సంబంధించిన వివరాలు మీకోసం. లెట్స్ 'గో'..

భారతదేశంలోని ఉత్తమ వెకేషన్ స్పాట్‌లలో గోవా 'మొదటి' స్థానంలో ఉంటుంది. అందమైన బీచ్‌లు, రంగురంగుల నైట్‌లైఫ్ చూసేందుకు మాత్రమే కాదు ఈ అందమైన తీరప్రాంతంలో పురాతన దేవాలయాలు, కేథడ్రల్, చారిత్రక కోటలు, మనోహరమైన పోర్చుగీస్ గ్రామాలు కూడా ఉన్నాయి. ఫ్లీ మార్కెట్స్, థ్రిల్లింగ్ వాటర్ స్పోర్ట్స్, క్యాసినో వంటి థ్రిల్లింగ్ ఆట్రాక్షన్స్ కూడా దీని సొంతం. గోవాలోని అన్ని స్పాట్స్‌ కవర్ చేయాలంటే ఓ వారమైనా పడుతుంది కాబట్టి ఉండేందుకు మంచి ప్లేస్ చూసుకోవడం ప్రధానం. ఎందుకంటే ఈ ప్రదేశమే మీ అనుభవాన్ని, గోవా ప్రయాణాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. గోవా ట్రావెల్ డైరీలో బెస్ట్ పార్ట్‌గా ఉంటుంది.

ద బకెట్ లిస్ట్

ఈ హాస్టల్ సంవత్సరంలో అన్ని సమయాల్లో పర్యాటకులను స్వాగతించే కలర్‌‌ఫుల్‌ప్లేస్‌గా చెప్పొచ్చు. ఇందులో మన సౌకర్యాన్ని బట్టి డార్మెటరీలు, ప్రైవేట్ గదులు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రత్యేకమైన రెస్టారెంట్‌తో పాటు, బార్ కూడా అందులోనే ఉంటాయి. చెఫ్-క్యూరేటెడ్ మెనూ అందించడం దీని మరో ప్రత్యేకత. విశ్రాంతి తీసుకునేందుకే కాదు పార్టీ చేసుకోవడానికి కూడా ఇక్కడ అనువైన వాతావరణం ఉంటుంది. అంతేకాదు టాటూ వర్క్‌షాప్స్, కరోకే నైట్స్‌తో పాటు 100కి పైగా పుస్తకాలతో కూడిన మినీ లైబ్రరీ, కో-వర్కింగ్ స్పేస్ దీని సొంతం. రెగ్యులర్‌గా భిన్నమైన ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి.

* లోకేషన్ : వాగేటర్‌లోని బాస్కిన్ రాబిన్స్ పార్లర్ పక్కనే ఈ హాస్టల్ ఉంటుంది.

* పేమెంట్ : మినిమం రూ.600తో ఇక్కడ ప్యాకేజీలు మొదలవుతాయి.

బంకర్ కంటైనర్

అప్‌సైకిల్ చేసిన షిప్పింగ్ కంటైనర్స్‌తో వీటిని తయారు చేశారు. ఇందులో డార్మెటరీలతో పాటు ప్రైవేట్ గదులు కూడా ఉంటాయి. ఈ హాస్టల్‌కు ఓ వైపు సముద్రం ఉండగా, మరోవైపు అడవి ఉంటుంది. ఇక్కడ అప్పుడప్పుడు యోగా/ఫిట్‌నెస్ వర్క్‌షాప్స్ హోస్ట్ చేస్తుంటారు. అతిథులు ఉచితంగానే ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. అందమైన సూర్యాస్తమయాలను వీక్షించేందుకు రూఫ్ టాప్ ఏరియా సహా ఓపెన్ ఎయిర్ కోర్ట్‌యార్డ్ ఉన్నాయి. అనేక ఇండోర్ గేమ్స్‌కు సంబంధించిన పరికరాలు కూడా అందుబాటులో ఉంటాయి.

* లొకేషన్ : చిన్న వాగేటర్ బీచ్ నుంచి 200 మీ దూరంలో ఉంటుంది.

* పేమెంట్ : ఒక రాత్రి స్టే చేసేందుకు మినిమం రూ.700 ఉంటుంది.

ఓల్డ్ క్వార్టర్ :

డార్మెటరీలు, ప్రైవేట్ గదులతో పాటు షేర్డ్ లాంజ్‌ను కలిగిన ఈ హాస్టల్.. సైక్లింగ్‌తో సహా ఆన్-సైట్ యాక్టివిటీస్ అందిస్తుంది. అతిథుల కోసం ప్రత్యేకంగా ఒక ఇన్‌హౌజ్ రెస్టారెంట్ కూడా ఉంది. పనాజీలోని ఫాంటైన్‌హాస్, రూవా 31 డి జనీరోలో ఉన్న ఈ హాస్టల్ మెరుగైన సౌకర్యాలను అందిస్తోంది.

* లొకేషన్ : పంజిమ్ చర్చి నుంచి కేవలం 600 మీటర్ల దూరంలో ఉంటుంది.

* పేమెంట్ : ఒక రాత్రి బస చేసేందుకు సగటు ఖర్చు రూ. 700 పైనే.

వోక్ హాస్టల్

ఈ హాస్టల్ గోవా నడిబొడ్డున ఉండగా, ఇది షేర్డ్ లాంజ్. ఇందులో ప్రైవేట్ గదులు, డార్మెటరీలతో పాటు ఓ పార్క్ కూడా ఉంది. ఈ ప్రాంతం సైక్లింగ్, బైక్ అద్దెకు ప్రసిద్ధి చెందింది. అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్, షేర్డ్ కిచెన్ ఈ హాస్టల్ ప్రత్యేకతలు కాగా అంజునా బీచ్, బాగా బీచ్, నైట్ మార్కెట్, కలంగుట్ బీచ్, కాండోలిమ్ ఫుట్‌బాల్ గ్రౌండ్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు దీనికి 2 కి.మీ పరిధిలో ఉన్నాయి. దివాన్ భాటి, అర్పోరాలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వెనుక ఉండే ఈ హాస్టల్.. గోవా వెకేషన్‌లో బెస్ట్ ఆప్షన్.

* లొకేషన్ : బాగా బీచ్ నుంచి 1.7 కి.మీ దూరంలో ఉంటుంది.

*పేమెంట్ : ఒక రాత్రికి సగటు ధర: రూ. 680 నుండి

కాజిల్ హౌస్

రెస్టో-బార్, స్విమ్మింగ్ పూల్‌ సహా విశాలమైన రెస్టారెంట్ ఈ హాస్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులోని ప్రత్యేకమైన పిజ్జా తయారీ ప్లేస్ ప్రత్యేక ఆకర్షణ కాగా అతిథులు సంప్రదాయ చెక్కతో కాల్చిన పిజ్జాను తయారు చేసే కళను చూడొచ్చు.

*లొకేషన్ : కలాంగుట్‌ బీచ్‌కి సమీపంలోనే ఉంటుంది.

*పేమెంట్ : ఇద్దరికి ఒక నైట్ స్టేయింగ్‌కు రూ. 2,500 పైనే.

సమ్మర్ హాస్టల్

ఒరేమ్ రోడ్‌లోని పలోలెం, పాట్నెం బీచ్‌ల మధ్య ఈ హాస్టల్ ఉన్నందున గొప్ప వీక్షణను పొందవచ్చు.

* లొకేషన్ : పలోలెం బీచ్ సమీపంలో ఉంటుంది.

* పేమెంట్ : ఒక రాత్రి స్టేయింగ్‌కు రూ.600

ఇక ఫోక్‌లోర్, డ్రీమ్స్, క్రాఫ్ట్, జంగిల్, వాండరర్స్ హాస్టల్స్ కూడా అందుబాటు ధరల్లోనే విడిది సేవలు అందిస్తున్నాయి. దాదాపు అన్ని హాస్టల్స్‌ ప్రత్యేక వంటగదులు, నైట్ పార్టీ, కచేరీలకు ప్రసిద్ధి చెందాయి. ఇవే కాదు గోవా మిత్రులతో పాటు, గూగుల్‌లో వెతికినా బోలెడు హాస్టల్స్, లాడ్జెస్ వివరాలు తెలుసుకోవచ్చు.

Tags:    

Similar News