వైభవంగా పంచకుండాత్మక మహా కుంభాభిషేక మహోత్సవ వేడుకలు

దిశ, యాదగిరిగుట్ట : శ్రీ స్వామివారి సప్తాహ్నిక పంచకుండాత్మక సహిత మహాకుంభాభిషేక..latest telugu news

Update: 2022-03-25 14:06 GMT

దిశ, యాదగిరిగుట్ట : శ్రీ స్వామివారి సప్తాహ్నిక పంచకుండాత్మక సహిత మహాకుంభాభిషేక మహోత్సవములు అత్యంత వైభవముగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహోత్సవములలో భాగంగా ఈరోజు 5వ రోజు శుక్రువారం శ్రీ స్వామి వారి బాలాలయంలో నిత్యారాధనల అనంతరము ఉ 9-00 గం॥లకు శాంతిపాఠం, చతుస్థానార్చనలు, మూలమంత్ర మూర్తి మంత్రహవనములు, స్వయంభూ ప్రధానాలయంలో ఏకోన పంచారత కలశాభిషేకం, తదుపరి బాలాలయంలో నిత్యలఘు పూర్ణాంతి నిర్వహించారు. ఈ ఉత్సవములను పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారముగా ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారామణీకులు అత్యంత వైభవముగా నిర్వహించిరి. ఈ వేడుకలలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహామూర్తి, ఆలయ ఈవో గీత సహాయ కార్యనిర్వహణాధికారులు పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ స్వామి వారి ఆలయంలో శీలా, లోహమయ మూర్తులకు నలభై తొమ్మిది కలశములతో అభిషేకం చేశారు. ఆగమ శాస్త్రములో ఈ నలభై తొమ్మిది సంఖ్య తెలుపుతూ ఇరవై ఐదు తత్వములు, పదిహేను తిధులు, ఏడు వారములు, రెండు పక్షములు, నలభై తొమ్మిదిని తెలియజేస్తూ భగవంతుని చేత సృష్టి చేయబడిన ప్రకృతి లోని ఈ నలభై తొమ్మిది తత్వములు కూడా ఆయా మంత్రముల అభిషేక జలములతో పవిత్రీకరింప చేయుచూ శిలా, లోహమయ మూర్తులకు తేజస్సును పెంపొందింపచేయును. నలభై తొమ్మిది కలశములలో పాలు, పెరుగు, నెయ్యి, తేనే, పంచదార, గోమూత్రం, సుగంధ ద్రవ్యములు కలిపి శుద్ధోదకములను ఆయా కలశములలో నింపి వేదమంత్ర పఠనములతో ఆయా మూర్తులను అభిషేకించవలయునని పాంచరాత్ర ఆగమ శాస్త్రము సూచించుచున్నది. ఈ కలశములలోని మంత్రములచే ఆవాహన గావింపబడిన నలభై తొమ్మిది తత్వములు విశేషమైన ఫలములను అందించుచున్నవి. పెరుగు స్థిర బుద్ధికి, దృఢ బుద్ధికి సంకేతము, తేనే, పంచదారలు భగవత్ ఆనందమునకు సంకేతములు, ఇలా ఇరవై ఐదు కాల సంబంధమైన, పదిహేను తిధులు సంవత్సర సూచకములైన రెండు ఆయనములు, వారములు ఎంతో మహిమాన్నితములని అన్ని భగవత్ స్వరూపములేనని వాటిలో ఉత్సవములు నిర్వహించిన భగవానుడికి ప్రీతి కలుగునని ఆగమ శాస్త్ర ప్రసిద్ధము.


సాయంకాల కార్యక్రమములు..

ఈ మహోత్సవములలో భాగంగా ఈ రోజు సాయంకాలము శ్రీస్వామి వారి బాలాలయములో నిత్యారాధనల అనంతరము సా. 6-00 గం.లకు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థాన అర్చనలు, మూలమంత్ర మూర్తి మంత్ర హవనములు నిర్వహింపబడును. స్వయంభూ ప్రధానాలయం నందు పంచామృలూధివాసం నిర్వహించెదరు. తదుపరి బాలాలయంలో నిత్య లఘు పూర్ణాహుతి నిర్వహింపబడును. ఈ ఉత్సవములను ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయణీకులు అత్యంత వైభవమంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవములలో ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

పంచామృతాధివాసం ప్రత్యేకత..

శిలామయ బింబ మూర్తులను లోహమయ మూర్తులను మంత్ర పూర్వకంగా అధివాస ఉత్సవములలో భాగంగా పంచామృతములలో పాలు, పెరుగు, చక్కెర, తేనె, గోమూత్రం అధివసింప చేయుదురు. మంత్ర పూర్వక పంచామృత అధివాస ప్రక్రియలో బింబాదులు శక్తివంతములై భగవంతుని అనుగ్రహమును పొందగలవు. తద్వారా ఈ ఉత్సవమును దర్శించిన, స్మరించిన భక్తకోటి ధన్యులగుదురు. ఆలయంలో నిర్వహింపబడే ఉత్సవములన్నీ శాస్త్ర మర్యాదను అనుసరించి నిర్వహించుట వలన విశ్వశాంతి, లోక కళ్యాణము మొదలగు అనేకములైన శుభ పరంపరలు కలుగునని, ఎంతో వైభవోపేతమైన శ్రీయాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి నూతన ఆలయ నిర్మాణం పునః ప్రతిష్ఠా మహోత్సవములతో నిర్వహింపబడును. ఈ ఉత్సవములు ఆచంద్రతారార్కము. పంచామృతములు భగవంతునికి అధివాసంలో సమర్పించుట వలన వాటి అంతర్గతమైన నిర్మలత్యం, ద్రృడత్వం, మాధుర్యం మొదలగు గుణములు మనకు భగవానుడు అనుగ్రహించును. సముద్రములు, నదులు, జలాశయములు, మొదలగు తీర్థరాజములు, వనస్వతి దేవతలకు అధిష్టానమువైన వృక్షములు, ఫలములు మొదలగునవి ఎంతో వృద్ధి చెందునని మరెన్నో విశేషములను కలిగియున్న ఈ పంచామృలూధివాస ఉత్సవము జరుగుతుంది.



Tags:    

Similar News