పెద్ద స్కెచే.. వారినే టార్గెట్ చేసిన దావుద్ ఇబ్రహీం

Update: 2022-02-19 16:34 GMT

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం కన్ను భారత్‌లోని బడా నేతలపై పడింది. దేశంలోని ప్రముఖులను, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. ఈ మేరకు నివేదిక వెల్లడించింది. దేశంలోని పలుప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా దావూద్ ఢిల్లీ, ముంబై నగరాలపై దృష్టి పెట్టినట్లు తెలిపింది.

దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. రెండు రోజుల క్రితం దావూద్ సన్నిహితుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. హవాలా ద్వారా నగదు లావాదేవీలు చేస్తూ ఉగ్ర కార్యకలాపాలతో దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దావూద్‌పై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. దావూద్ హిట్ లిస్టులో ప్రముఖ రాజకీయ వేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు ఎన్ఐఏ నివేదికలో పేర్కొంది.

Tags:    

Similar News