సర్కార్‌లో' మోకాలి చిప్ప' సర్జరీలు ఫ్రీ
దిశ, తెలంగాణ బ్యూరో: ఇక నుంచి సర్కారీ ఆసుపత్రిలో మోకాలి చిప్ప సర్జరీలు ఫ్రీగా జరగనున్నాయి..latest telugu news
దిశ, తెలంగాణ బ్యూరో: ఇక నుంచి సర్కారీ ఆసుపత్రిలో మోకాలి చిప్ప సర్జరీలు ఫ్రీగా జరగనున్నాయి. ఇప్పటి వరకు ఆధునాతన సౌకర్యాలేమీ లేకపోవడంతో పెద్దగా సర్జరీలు జరగేవి కాదు. దీంతో చాలా మంది ప్రైవేటు ఆసుపత్రిలకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. దీంతో ఎంతో మంది పేదలపై అదనపు భారం పడుతుంది.
దీన్ని గ్రహించిన మంత్రి హరీష్ రావు సర్కార్ లోనూ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గ్రామాల్లో క్యాంపులు పెడుతూ బాధితులను గుర్తించాలన్నారు. గజ్వేల్లో ఫైలజ్ ప్రాజెక్టును నిర్వహించి , తర్వాత రాష్ట్రమంతటా అమలు చేయాలని భావిస్తున్నది. ఆర్థోపెడిక్ డాక్టర్లు వెళ్లి గ్రామాల్లో క్యాంపులు పెట్టి సర్జరీలు అవసరమయ్యే పేషెంట్లను గుర్తించి, వారిని తీసుకొచ్చి ప్రభుత్వ దవాఖానలో పూర్తి ఉచితంగా సర్జరీలు చేయనున్నారు.మోకీలు, తుంటి మార్పిడి వంటి సర్జరీలు చేయనున్నారు. గాంధీ ఆసుపత్రి టీమ్ లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి 60 ఏళ్లు దాటినోళ్లందరికీ చెకప్‌లు చేయనున్నారు.