గంటకు 100 మైళ్ల వేగంతో కారు నడిపిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?

దిశ, ఫీచర్స్: 1904, జూలై 21న గంటకు 100 మైళ్ల వేగంతో కారు నడిపిన మొదటి వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు ఫ్రెంచ్‌ మ్యాన్ లూయిస్ రిగోలి..Latest Telugu News

Update: 2022-07-21 04:23 GMT

దిశ, ఫీచర్స్: 1904, జూలై 21న గంటకు 100 మైళ్ల వేగంతో కారు నడిపిన మొదటి వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు ఫ్రెంచ్‌ మ్యాన్ లూయిస్ రిగోలి. బెల్జియంలోని ఓస్టెండ్ బీచ్‌లో 166.665 km/h వేగంతో గోబ్రోన్-బ్రిల్లీ రేసింగ్ కారును నడిపి అతను ఈ ఘనత సాధించాడు.

21.6 సెకన్లలో కిలోమీటర్ కోర్సును అధిగమించిన ఆయన.. బెల్జియన్ పియర్ డి కేటర్స్ మార్క్ 97.25 mphను అధిగమించాడు. అయితే ఈ రికార్డ్ మూడు నెలలు మాత్రమే పదిలంగా ఉండగా.. తొలి గ్రాండ్ ప్రిక్స్ మోటార్ రేసింగ్‌లో కూడా పాల్గొన్న రిగోలీ 1902లో ప్రారంభమైన సర్క్యూట్ డెస్ ఆర్డెన్నెస్‌ రేస్‌లో గెలుపొందాడు.


Similar News