నిద్ర లేకుండా చేసే నాలుగు బలమైన కారణాలివే..?
చాలా మంది నిద్ర పట్టడం లేదని తమలో తామే సతమతమవుతుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది నిద్ర పట్టడం లేదని తమలో తామే సతమతమవుతుంటారు. కొంతమంది ఆసుపత్రికెళ్లి వైద్యుల్ని సంప్రదిస్తారు. కొంతమంది ఇంట్లోనే పలు చిట్కాలు ఫాలో అవుతుంటారు. కానీ నిద్రపట్టకపోవడానికి ముఖ్య కారణాలేంటో గుర్తించరు. మరీ రాత్రి నిద్ర పట్టకపోవడానికి బలమైన కారణాలేంటో నిపుణులు చెప్పినవి ఇప్పుడు చూద్దాం..
కామవాంఛలు: మనిషి కోరికలు అనంతం కానీ.. కానీ కామవాంఛలు ఎక్కువగా ఉన్నట్లైతే మాత్రం అస్సలు నిద్రపట్టదనినిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కోరికలే మనిషిని చెడుదారుల్లో తీసుకెళ్లేందుకు కారణమవుతాయని అంటున్నారు.
శత్రుత్వం : అలాగే బలవంతుడితో శత్రుత్వం ఉంటే నిద్ర పట్టదు. ఎందుకంటే ఏ క్షణంలో ఏమవుతుందోనని అనుక్షణం భయపడుతూ ఉంటారు. కాగా రాత్రివేళ ప్రశాంతంగా నిద్రపోరు.
ఆస్తులు పోగోట్టుకోవడం: ఎవరైతే.. ఉన్న ఆస్తి, పాస్తులు పోడగొట్టుకుంటే నిత్యం వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. తెల్లవార్లు అయ్యో అలాగైందే.. ఎలా అవన్నీ సంపాదించుకోవడం ఎలా? అంటూ నిద్రపోకుండా ఆలోచిస్తారు.
దొంగతనం: దొంగతనం అలవాటు అయితే కూడా నిద్రపట్టదు. వారు ఎప్పుడూ దొంగతనం గురించి ఆలోచిస్తూ ఉంటారు. దీంతో వారు ప్రశాంతంగా నిద్రపోరు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.