2012 భారత్-పాక్ సిరీస్‌లో ఆసక్తికర ఘటన.. బయటపెట్టిన PCB మాజీ చైర్మన్
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) మాజీ ఛైర్మన్ 2012 - 13లో భారత్‌లో పాకిస్థాన్ టూర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను మీడియాకు వెల్లడించారు.
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) మాజీ ఛైర్మన్ 2012 - 13లో భారత్‌లో పాకిస్థాన్ టూర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను మీడియాకు వెల్లడించారు. కాగా, 2012లో మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడేందుకు పాకిస్థాన్ భారత్‌లో పర్యటించింది. ఆ సమయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడిగా ఉన్న జాకా అష్రఫ్ ఈ టూర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. భారత్, పాకిస్థాన్‌లు పరస్పరం ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడి దాదాపు దశాబ్ద కాలం గడిచింది. 2012లో జరిగిన వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తో కైవసం చేసుకోగా, టీ20 సిరీస్ డ్రాగా ముగిసింది.
''నా హయాంలో (పీసీబీ అధ్యక్షుడిగా) మా జట్టు భారత్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆటగాళ్ల భార్యలు కూడా రావాలని సలహా ఇచ్చాను.. ఆటగాళ్లు కాస్త అభ్యంతరం వ్యక్తం చేసినా వారి భార్యలు దగ్గరుండి చూస్తారని చెప్పాను. క్రికెటర్ల వెంట భార్యలు ఉంటే ఆటగాళ్లు నియంత్రణలో ఉంటారని వివరించాను. చివరికి అందరూ వారిని తీసుకుని చక్కగా భారత్‌కు వెళ్లారు. భారత్ మీడియా ఎల్లప్పుడూ మమ్మల్ని ట్రాప్ చేయడానికి చూసేది. మా ఆటగాళ్లు మరియు మా దేశ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తుంది. దీంతో భారతీయ మీడియాకు అలాంటి అవకాశం ఇవ్వకూడదనే నాడు అలా వ్యవహరించినట్లు అష్రాఫ్ వెల్లడించారు.