అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం: Konda Vishweshwar Reddy
దిశ, సిద్దిపేట: భారత రాజ్యాంగ నిర్మాత - Former MP Konda Vishweshwar Reddy participated in Ambedkar's 131st birth anniversary function in Siddipet town
దిశ, సిద్దిపేట: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం, ప్రజా పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 131వ జయంతి సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఒక కులానికో.. ఒక వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదన్నారు. నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొమ్మల యాదగిరి, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, పీసీసీ సభ్యుడు గంప మహేందర్, వోబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సూర్యవర్మ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, నాయకులు షాబుద్దీన్, గ్యాదరి మధు తదితరులు పాల్గొన్నారు.