Sleep: శీతాకాలంలో మంచి నిద్రకు దారితీసే ఆహారాలు..?
చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. కాగా ఇందుకోసం నిపుణులు చెప్పినవి.. అలాగే పలు ఇంటి చిట్కాలు ఫాలో అవుతుంటారు. నిద్ర లేకపోతే ఏ పని కూడా సరిగ్గా చేయలేం. ఏకగ్రత నశిస్తుంది. ఆకలి కూడా వేయదు. పైగా డిప్రెషన్(Depression)కు వెళ్లిపోతారు. కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అయితే చలికాలంలో మంచి నిద్ర ఉండాలంటే పలు టిప్స్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
శీతాకాంలో తొందరగా నిద్రపట్టాలంటే మెదడు పనితీరును మెరుగుపరిచే చామంతి పూల టీ(Chamomile tea)తాగండి. అలాగే కివి పండ్లు(Kiwi fruits) తినండి. వీటితో పాటుగా కండరాల్నని రిలాక్స్‌గా ఉంచే చిలకడదుంప(sweet potato) తీసుకోండి. అలాగే శీతాకాలంలో చెంచడు తేనె(Honey), గోరు వెచ్చని పాలు తాగండి. మెలటోనిన్ ను ఉత్పత్తి చేసే అరటి పండు తినండి. దీంతో బాడీ రిలాక్స్ గా అనిపించి మంచి నిద్రకు దారితీస్తుంది. పూర్తి ఆరోగ్యానికి మేలు చేసే బాదం (almond)తినండి. చలికాలంలో ఇవి తీసుకుంటే కనుక హ్యపీగా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.