FLASH: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్..!

ఏపీ హైకోర్టులో ఐకాన్ స్టార్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన కోరారు.

Update: 2024-10-21 07:39 GMT

దిశ, సినిమా: ఏపీ హైకోర్టులో ఐకాన్ స్టార్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన కోరారు. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై నేడు విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.


Similar News