సింగరేణిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
దిశ, రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని అర్జీ-3 పరిధిలోని ALP గనిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది.
దిశ, రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని అర్జీ-3 పరిధిలోని ALP గనిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సింగరేణిలోని ఏఎల్‌పీలోని 85వ లెవల్ వద్ద రూప్ బోల్ట్ చేస్తూ.. కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులతో పాటు ఓ అసిస్టెంట్ మేనేజర్ స్థాయి అధికారి సైతం మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కార్మికులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.