8 నెలల పసికందుతో సహా ఐదుగురు సజీవదహనం

దిశ, వెబ్‌డెస్క్: ఒకె కుటుంబానికి చెందిన 5గురు నెలల పసికందుతో సహా అగ్ని ప్రమాదంలో

Update: 2022-03-08 06:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒకె కుటుంబానికి చెందిన 5గురు నెలల పసికందుతో సహా అగ్ని ప్రమాదంలో మరణించారు. ఈ హృదయవిదారక ఘటన కేరళలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని వర్కాల లో మంగళవారం ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. మంగళవారం తెల్లవారుజామున 1.45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగి.. ప్రతాపన్ (62), షెర్లీ (53), అభిరామి (25), అఖిల్ (29), అభిరామి ఎనిమిది నెలల కుమారుడు రియాన్‌లు చనిపోయారు.

ప్రతాపన్ కూరగాయలు అమ్మేవాడు. కొంతకాలంగా వర్కాలలో పని చేసుకుంటున్నాడు. అయితే ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ప్రతాపన్ పెద్ద కుమారుడు నిహుల్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) దివ్య గోపీనాథ్ కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News