దారుణం.. కన్నకూతురుపైనే తండ్రి అత్యాచారం.. ఆమెకు తెలియడంతో..
దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో రోజురోజుకు మహిళలపై అరాచకాలు ఎక్కువైపోతున్నాయి.- latest Telugu news
దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో రోజురోజుకు మహిళలపై అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. క్షణిక సుఖం కోసం వావివరుసలు మరిచి.. రాక్షసులా కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు కొందరు కామాంధులు. కొన్ని ఘటనలు చూస్తే.. మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతోంది అనిపిస్తుంది. కామంతో రగిలిపోతున్న కొందరు దుర్మార్గులు.. తల్లి, పిల్ల, చెల్లి అని కూడా చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. జీవితాంతం ఎలాంటి ఆపద కలగకుండా చూసుకోవాల్సినే కన్నతండ్రే.. కూతురు పాలిట శాపమైయ్యాడు. ఓ తండ్రి సొంత కూతురిని అత్యాచారం చేసిన ఘటన పుణెలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. పుణెలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వీరికి 11ఏళ్ల కూతురు ఉంది. అయితే, కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఇంట్లో ఎవరు లేని సమయంలో కూతురుపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ బాలిక ఈ దారుణాన్ని ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోయింది. ఎట్టకేలకు కొన్ని రోజుల తర్వాత జరిగిన విషయాన్ని తన అమ్మమ్మకు తెలియజేసింది. వెంటనే కీచక తండ్రిపై బాలిక అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.