అది నిజమని నిరూపిస్తే.. ఉరి కంబం ఎక్కేందుకు సిద్ధం: మాజీ సీఎం

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న మూవీ ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’.- latest Telugu news

Update: 2022-03-23 13:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న మూవీ 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'.డైరెక్టర్ వివేక్ అగ్రిహోత్రి దర్శకత్వంలో.. 1990ల్లో కాశ్మీరీ పండిట్ల మారణకాండ నేపథ్యంలో తెరకెక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లు సాధిస్తోంది. అయితే ఈ సినిమా విడుదలైనా రోజు నుండి తీవ్ర చర్చలకు దారి తీసింది. 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' సినిమా ఎన్ని ప్రశంసలు అందుకుందో అంతకుమించి విమర్శలను మూటగట్టుకుంది. రాజకీయ నాయకుల జోక్యంతో ఈ సినిమా తీవ్ర వివాదాలకు దారితీసింది. ఇందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన ఓ ప్రముఖ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. '1990 నాటి కాశ్మీరి పండిట్ల ఊచకోతకు, వలసలకు నేను కారణం అని ఎవరైనా నిరూపిస్తే.. నేను దేశంలో ఎక్కడైనా సరే ఉరి కంబం ఎక్కేందుకు సిద్ధం.. నన్ను అక్కడే ఉరి తీయండని చాలెంజ్ చేశారు. ఆనాటి ఘర్షణలకు కారణం ఎవరో తెలియాలంటే ఒక కమిటిని నియామించండి.. నేను విచారణకు ఎదుర్కొనేందుకు సిద్ధమని పేర్కొన్నారు. విచారణ చేస్తే నిజనిజాలతో పాటు.. ఆ ఘటనకు కారణం ఎవరో తెలుస్తుందని అన్నారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు కావాలంటే అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌ను కానీ.. అప్పటి హోంశాఖ మంత్రి అరిఫ్ మహ్మద్‌ను గానీ కలవచ్చని సూచించారు. కొందరు ఈ సినిమాను కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని' ఆరోపించారు.

Tags:    

Similar News