అసెంబ్లీ ముట్టడించిన రైతులు.. హై టెన్షన్

రాష్ట్రంలో మూతబడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరవాలని డిమాండ్ చేస్తూ రైతులు అసెంబ్లీని ముట్టడించారు.

Update: 2022-03-15 10:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో మూతబడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరవాలని డిమాండ్ చేస్తూ రైతులు అసెంబ్లీని ముట్టడించారు. ఒక్కసారిగా రైతులు అసెంబ్లీ వైపు రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైతులను అడ్డుకొని అదుపులోకి తీసుకుని గోషామహల్‌ పీఎస్‌కు తరలించారు. అసెంబ్లీని ముట్టడించిన వారిలో జనగామ, నిజామాబాద్‌కు చెందిన రైతులు ఉన్నారు. నాంపల్లికి వచ్చిన రైతులు అక్కడి నుంచి అసెంబ్లీ దగ్గరున్న గన్ పార్క్ వద్దకు చేరుకొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ అసెంబ్లీని ముట్టడించారు.

Tags:    

Similar News