రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. పెట్టుబడి కూడా రావడం లేదు..

దిశ, వర్గల్: టమాట ధరలు మరోసారి పడిపోయాయి, మండల కేంద్రంలో 20 కిలోల బాక్స్ 50 నుండి 60 పలుకుతుంది.. Latest Telugu News..

Update: 2022-03-15 08:18 GMT

దిశ, వర్గల్: టమాట ధరలు మరోసారి పడిపోయాయి, మండల కేంద్రంలో 20 కిలోల బాక్స్ 50 నుండి 60 పలుకుతుంది. వ్యాపారులు కిలో టమాట రూ.5లకు విక్రయిస్తున్నారు దీనితో ఆరుగాలం కష్టపడి సాగుచేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని శేరిపల్లి, గుంటిపల్లి, దండుపల్లి, వర్గల్ ప్రాంతాల్లోని రైతులు చాలా వరకు టమాట సాగు చేశారు. మండల పరిధిలో ఆదివారం, శుక్రవారం జరిగే సంతకు పెద్ద ఎత్తున టమాట రావడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు, ఎకరం పొలంలో టమాట ఒక్క కోతలో 100కు పైగా బాక్సులు దిగుబడి వస్తుంది. ఇందుకు ఐదుగురు లేదా ఆరుగురు కూలీలకు 300 చొప్పున రూ,1800 మార్కెట్ తీసుకెళ్లేందుకు ఒక్కొక్క బాక్స్‌కు రూ.30 చొప్పున రూ.3000 ఖర్చు అవుతుంది. మార్కెట్‌లోని టైబజార్ రూ.50 కలిపి రూ.3050 అవుతుంది.

వంద బాక్సులు అమ్మితే రూ.5000 వస్తుంది వీటిని అమ్మి పెట్టేందుకు ఎజెంటుకు కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అమ్మకానికి తీసుకెళ్లిన రైతులకు కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు. వచ్చే ఆదాయం కోతకు, రవాణాకే పోతే పెట్టుబడి సంగతి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎకరం పొలంలో ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ అలాగే విత్తనాలకు కలిపి రూ.20,000 వరకు వస్తుందని దానికి తోడు కొత్తరకం పురుగులు వచ్చి పంటను దెబ్బతీస్తుందని వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు..

'వరి పంట వేయొద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి అంటే సర్కారు చెప్పినట్టే నాకున్న అర ఎకరంలో టమాటా వేశా, ఆరుగాలం కష్టపడి పంటను పండిస్తే మార్కెట్‌లో ధర లేక నష్టం జరిగింది, ఇత్తుల కోసం అప్పులు చేసి మందులు కొట్టి పండించా. ఇప్పుడు పంట చేతికందే సరికి ధర లేదు, దీంతో ఏం చేయాట్లో తోచడం లేదు. చేసేది ఏమి లేక పశువులను మేపుదాం అని చూస్తూన్న, మా పక్కపొంటి చాలా మంది రైతులు మేపుతున్నారు, నష్టపోయిన రైతులను సర్కారు కొంత చొరవ తీసుకొని అండగా నిలసుంటే బాగుంటది' అని అవుసులోనిప్లి రైతు కిష్టపురం యాదయ్య కోరారు.

Tags:    

Similar News