Face Pack For Men: అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా ఫేస్‌పై కేర్ తీసుకోవాల్సిందే..!!
ఎక్కువగా ఫేస్‌పై ఎక్కువగా చూపిస్తారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎక్కువగా ఫేస్‌పై ఎక్కువగా చూపిస్తారు. చిన్న పింపుల్ కాగానే అయ్యో అంటూ తెగ కంగారు పడిపోతారు. పలు ప్రొడక్ట్స్ అండ్ ఏం చిట్కాలు పాటిస్తే మొటిమలు తగ్గిపోతాయి, ముఖం తళతళ మెరిసిపోతుందని సెర్చ్ చేస్తుంటారు. కానీ అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు తమ స్కిన్ పై అంత శ్రద్ధ చూపించరు. చర్మంపై ఏదైనా సమస్య కనిపించినా నిర్లక్ష్యం చేస్తుంటారు. అస్సలు ముఖంపై కేర్ తీసుకోరు. కొంతమంది బాయ్స్ చర్మ సంరక్షణను అనుసరిస్తారు. చర్మానికి సంబంధించిన పలు ప్రొడక్ట్స్ కూడా ఉపయోగిస్తుంటారు. అయితే అమ్మాయిలే కాదు స్కిన్ సంరక్షణ కోసం అబ్బాయిలు కూడా చర్మంపై ఫోకస్ చేయడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.
అయితే అమ్మాయిల కన్నా ఎక్కువగా అబ్బాయిలే బయట తిరుగుతుంటార. కాగా ఈ క్రమంలో ఫేస్ పై దుమ్ము, ధూళి పేరుకుపోయి.. జిడ్డుగా మారిపోతుంది. కానీ కొంతమంది అబ్బాయిలు ఈ జిడ్డును తొలగించడానికి కనీసం ఫేస్ వాష్ కూడా చేసుకోరు. దీంతో ముఖంపై మొటిమలు వస్తుంటాయి. అంతేకాకుండా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తాజాగా నిపుణులు చెప్పినవి పాటిస్తే చాలు.
ఫేస్ జిడ్డు బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఫేస్ వాష్ తో ఫేస్ కడగాలి. తర్వాత క్రీమ్ ఫేస్ కు రాసుకోవాలి. వీలైనప్పుడల్లా పలు రకాల ఫేస్ మాస్క్ లు వాడాలి. దీంతో ఫేస్ కలర్ మారకుండా ఉంటుంది. అంతేకాకుండా ముఖంలో గ్లో వస్తుంది. స్కిన్ ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అలాగే పలు హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ లను కూడా అప్లై చేయడం మేలు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్..
ఈ ఫేస్ ప్యాక్ కోసం ఒక టీస్ఫూన్ తేనె తీసుకోవాలి. తగినంత వాటర్, ముల్తానీ మట్టి రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. అప్లై చేసే విధానం చూసినట్లైతే.. ముందుగా ముల్తానీ మట్టి తీసుకుని వాటర్ పోసి కలుపుకోవాలి. ఐదు నిమిషాలయ్యాక ఒక టీ స్ఫూన్ తేనె యాడ్ చేయండి. తర్వాత దీన్ని మెడకు, ఫేస్ కు అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగితే జిడ్డు వదులుతుంది.
పెసర పిండి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్‌కు కోసం రోజ్ వాటర్ అండ్ ఒక టేబుల్ స్ఫూన్ పెసర పిండి తీసుకోండి. పెసరపిండిలో రోజ్ వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి. దీనికి బదులుగా మీరు శనిగపిండి లేదా బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు. ఈ ఈ పిండితో రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి అప్లై చేస్తే జిడ్డు తొలిగిపోతుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.