దేశీయ ఎగుమతులు $380 బిలియన్లు.. 2022 ముగింపుకు 410 బిలియన్ డాలర్లు
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి7 వరకు దేశీయ సరుకుల ఎగుమతులు..telugu latest news
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి7 వరకు దేశీయ సరుకుల ఎగుమతులు 380 బిలియన్ డాలర్లు దాటాయని, 2021-22 నాటికి 410 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం తెలిపారు. కెనడా మంత్రి మేరీ Ng గౌరవార్థం ఇచ్చిన విందులో పాల్గొన్న ఆయన భారత్-కెనడా సంబంధాల గురించి మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం ఆర్థిక సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని అన్నారు. "కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి, ఒకరికొకరు సహాయం చేయడానికి, అంతర్జాతీయ ఫోరమ్‌లలో ఒకరితో ఒకరు పని చేయడానికి సహాయపడుతుంది... ఈ రోజు కెనడాలో 7,00,000 మంది భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నారు, రాబోయే కాలంలో 1.4 మిలియన్లకు చేరుకోనున్నారని" గోయల్ పేర్కొన్నారు.
అలాగే మౌలిక సదుపాయాలు,తయారీ వంటి రంగాలలో కెనడా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని గోయల్, మంత్రిని కోరారు. కెనడా కూడా భారత్‌తో ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ (FIPA)ని కొనసాగిస్తోందని, భారత్‌లో వ్యాపారాలకు భారీ అవకాశాలు ఉన్నాయని, కెనడా కంపెనీలు ఇప్పటికే ఇండియాలో 65 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని మేరీ ఎన్‌జీ తెలిపారు.
Concluded a constructive day with an address at the dinner hosted for my Canadian counterpart @Mary_Ng.
— Piyush Goyal (@PiyushGoyal) March 11, 2022
We are working on building an economic partnership based on shared values of democracy, pluralism & rules-based trading mechanisms.
📹 https://t.co/PKN82FYZzR pic.twitter.com/8431JhYl4h