పగటి నిద్ర.. అల్జీమర్స్‌కు సంకేతమా?
దిశ, ఫీచర్స్: చాలామందికి మధ్యాహ్నం పూట - Excessive daytime napping could be early sign of Alzheimer’s disease
దిశ, ఫీచర్స్: చాలామందికి మధ్యాహ్నం పూట, ఇతర వేళల్లో కొద్ది సమయం కునుకు తీసే అలవాటు ఉంటుంది. అయితే, ఇలా రోజుకు ఒక గంట లేదా ఎక్కువ సార్లు నిద్రపోవడం అల్జీమర్స్ వ్యాధికి ముందస్తు సంకేతమని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. పగటిపూట అధిక నిద్ర కారణంగా మెదడు ఆకృతిలో మార్పులు సంభవించి జ్ఞాపక క్షీణత (cognitive decline)కు దారితీస్తుందని అధ్యయనంలో తేలింది. అయితే పగటి నిద్ర దీర్ఘకాలికంగా కొనసాగితే, అది మెదడు అనారోగ్యానికి సంకేతమా?
అంతరాయం కలిగించే లేదా విచ్ఛిన్నమైన నిద్ర(డిస్‌రప్టెడ్ స్లీప్ ప్యాటర్న్స్).. అల్జీమర్స్ రోగలక్షణ సంకేతాలను వేగవంతం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. 'ట్రాకింగ్ మెమొరీ' ప్రాజెక్ట్‌లో భాగంగా వెయ్యికి పైగా సీనియర్ సిటిజన్లపై నిర్వహించిన పరీక్షలు.. పగటిపూట నిద్ర, జ్ఞాపక క్షీణత మధ్య సంబంధాన్ని వెల్లడించాయి. సాధారణంగా వయసుతో పాటు న్యాప్స్ ఫ్రీక్వెన్సీ వ్యవధి పెరుగుతుంది. కానీ అల్జీమర్స్‌తో బాధపడుతున్న వ్యక్తులను, అల్జీమర్స్‌లేని వారితో పోలిస్తే న్యాప్ వ్యవధి, ఫ్రీక్వెన్సీలో వార్షిక పెరుగుదల రెట్టింపుగా ఉన్నట్లు గుర్తించారు.
దీర్ఘకాలిక లేదా తరచుగా పగటి నిద్రలు అల్జీమర్స్‌కు దారితీసే ప్రమాదంతో ముడిపడి ఉన్నాయి. దీని వల్ల ఏడాది వ్యవధిలోనే జ్ఞాపకశక్తి మందగిస్తుండగా.. అతి నిద్రతో కాగ్నిషన్ శక్తి తగ్గుతోంది. ఇక పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం మెదడు వృద్ధాప్యాన్ని స్పీడ్‌అప్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అల్జీమర్స్‌కు ముందస్తు సంకేతంగానూ కనిపిస్తోంది. ఆశ్చర్యకరంగా పగటిపూట నిద్రపోవడం, జ్ఞాపక క్షీణత మధ్య సంబంధాన్ని రాత్రి నిద్ర ప్రభావితం చేయలేదు.
- పరిశోధకుల బృందం