గ్యాస్ సిలిండర్లకు పూల దండలు.. మోగిన చావు డప్పు..

దిశ, వనపర్తి టౌన్ : గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. Latest Telugu News..

Update: 2022-04-01 12:26 GMT

దిశ, వనపర్తి టౌన్ : గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి జిల్లెల చిన్నారెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ తత్వాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మహిళలు గ్యాస్ సిలిండర్లకు పూలదండలు వేసి, చావు డప్పు మోగించి, మోడీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలు పెంచి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయని విమర్శించారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారీతిగా ధరలను పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే గ్యాస్, డీజిల్ పెట్రోల్ ,విద్యుత్ చార్జీలను తగ్గించాలన్నారు. లేదంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో దేవరకద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జీఎంఆర్, కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిలాష్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రసాద్, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి, పట్టణ అధ్యక్షుడు డి కిరణ్ కుమార్, శ్రీరంగపురం జడ్పీటీసీ రాజేంద్ర ప్రసాద్ యాదవ్, మత్స్యకార జిల్లా చైర్మన్ యాదయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంధం రాజశేఖర్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు కమ్మర్ మియా, వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్, మాజీ కౌన్సిలర్ చీర్ల చందర్, నాయకులు కోట్ల రవి, చీర్ల జనార్ధన్,‌ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ, కౌన్సిలర్ బ్రహ్మం, కౌన్సిలర్ జయసుధ మధుసూదన్ గౌడ్, కౌన్సిలర్ సుమిత్ర యాదగిరి, మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు, ఎన్ ఎస్ యుఐ నేషనల్ కోఆర్డినేటర్ త్రినాథ్, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేశ్, బాబా, దివాకర్ యాదవ్, విజయవర్ధన్ రెడ్డి, చంద్ర శేఖర్ యాదవ్ మన్యంకొండ, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News