AP News: 'రాజకీయాలకు అతీతంగా తిరుమల కోసం అంతా పోరాడాలి'

దిశ, ఏపీ బ్యూరో : తిరుమలలో భక్తుల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పీఏసీ చైర్మన్ పయ్యావుల..latest lelugu news

Update: 2022-04-13 10:40 GMT

దిశ, ఏపీ బ్యూరో : తిరుమలలో భక్తుల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. ఇప్పటికే తిరుమలలో భక్తులు పడుతున్న ఇబ్బందుల సమసిపోలేదని చెప్పుకొచ్చారు. లక్ష మందికి ఏర్పాట్లు చేయగలిగే టీటీడీ.. కనీసం ఇప్పుడు భక్తులకు చలువ పందిళ్ళు కూడా ఎందుకు వెయ్యలేదు? అని ప్రశ్నించారు. 'కొండమీద 1500 గదులు కేటాయించక పోవడానికి కారణం ఏంటి? అని నిలదీశారు.

సీఎం వస్తారని టీటీడీ జేఈవో ఎప్పుడో పోయి ఒంటిమిట్టలో కూర్చున్నారు. అసంబద్ధ నిర్ణయాల వల్లనే ఈ ఇబ్బందులు తలెత్తాయి. రాజకీయాలకు అతీతంగా తిరుమల కోసం అంతా పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. కొండ మీద పరిస్థితి చూసి ఇతర ప్రాంతాలలోని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితి తీసుకువచ్చారు' అని పీఏసీ చైర్మన్ వ్యాఖ్యానించారు. టీటీడీ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.. భక్తులు సంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి తీసుకురావాలి అని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సూచించారు.

Tags:    

Similar News