ట్విట్టర్‌కు పోటీ ఇచ్చేందకు సిద్ధమైన ప్రపంచ కుబేరుడు.. త్వరలో కొత్త సోషల్ మీడియా?
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌కు పోటీ ఇచ్చేందుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సిద్ధమయినట్లు తెలుస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌కు పోటీ ఇచ్చేందుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సిద్ధమయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సోషల్ మీడియా వేదికలపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన కొత్త సోషల్ మీడియాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇటీవల ఓ ట్వి్ట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విషయంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు చెప్పడం వైరల్‌గా మారింది. స్వేచ్ఛ భావ వ్యక్తీకరణకు అవకాశం ఉండి, అసత్య ప్రచారాలకు ఆస్కారం లేకుండా ఉండే ఓ వేదికను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అంతేగాక, ఎలన్ మస్క్ ఇటీవలే ట్విట్టర్‌లో ఓ పోల్ నిర్వహించారు. ప్రజాస్వామ్యానికి వాక్ స్వాతంత్ర్యం అత్యంత కీలకం అని, ట్విట్టర్ ఆ భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతున్నదని భావిస్తున్నారా? అంటూ పోల్ పెట్టారు. అంతేకాక, కొత్తగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నిర్మించడానికి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు వివరించారు.
ట్విట్టర్ ప్రజలకు చాలా చేరువైందని, కానీ, ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉండే భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నదన్నారు. ఈ తరుణంలోనే ఆయన 26వ తేదీన ఒక కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అవసరం ఉన్నదా? అని అడిగారు. కొత్త ప్లాట్‌ఫామ్ నిర్మించడానికి ఎలన్ మస్క్ నిర్ణయం తీసుకున్నట్టయితే.. ఇప్పటికే ఈ రంగంలో అడుగుపెడుతున్న టెక్ కంపెనీల జాబితాలో చేరతారు. అవి కూడా ఫ్రీ స్పీచ్ ప్రధానంగా పుట్టుకొస్తున్నవే కావడం గమనార్హం. అవే కార్యరూపం దాలిస్తే.. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ యూజర్లను లాగేసుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
Free speech is essential to a functioning democracy.
— Elon Musk (@elonmusk) March 25, 2022
Do you believe Twitter rigorously adheres to this principle?