లక్నో: ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ శనివారం కీలక ప్రకటన చేసింది. ప్రచారాలపై ఉన్న ఆంక్షలను సవరిస్తున్నట్లు శనివారం పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అనుమతులతో పరిమిత సంఖ్యలో ప్రచారకర్తలతో పాదయాత్రకు చేసుకోవచ్చని తెలిపింది.
అంతేకాకుండా ప్రచార సమయాల్లోనూ మార్పులు చేసింది. అంతకుముందు ఉన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు సమయాన్ని ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మార్చింది. అయితే రాష్ట్ర అధికారుల సూచనలతో, కరోనా నిబంధనలు పాటించాలని కోరింది. దీంతో పాటు రాజకీయ నాయకులు 50శాతం సామర్థ్యంతో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించింది. అంతేకాకుండా జిల్లా అధికారుల అనుమతితో పరిమిత సంఖ్యలో ప్రచారకర్తలతో పాదయాత్ర చేసుకునేందుకు అనుమతించింది. కాగా, తాజాగా దేశవ్యాప్తంగా 50,407 కరోనా కేసులు నమోదయ్యాయి.