ప్రపంచంలోనే తొలిసారి.. గాలిని ప్యూరిఫై చేసే హెడ్‌ఫోన్‌

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ డైసన్ స్వచ్ఛమైన..telugu latest news

Update: 2022-03-31 11:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ డైసన్ స్వచ్ఛమైన ఆడియో, స్వచ్ఛమైన గాలిని అందించే ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్-ప్యూరిఫైయింగ్ హెడ్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. ఇది ధరించడానికి అనువుగా ఉంటుంది. స్పెసిఫికేషన్ పరంగా ప్యూరిఫైయర్, నాయిస్ క్యాన్సిలింగ్, హై ఫిడిలిటీ ఓవర్‌ను కలిగి ఉంది. హెడ్‌ఫోన్‌లు ఒకే సమయంలో చెవులకు ధ్వనిని అందజేస్తాయి. దానితో పాటు ముక్కు, నోటి గాలిని శుద్ధి చేస్తుంది. ఇది పీల్చే గాలిని ఫిల్టర్‌లు, రెండు సూక్ష్మీకరించిన ఎయిర్ పంపులను ఉపయోగించి ముఖాన్ని తాకకుండా స్వచ్ఛమైన గాలిని అందిస్తుందని చీఫ్ ఇంజనీర్ జేక్ డైసన్ చెప్పారు. బయటి గాలిని డ్యూయల్-లేయర్ ఫిల్టర్‌ల ద్వారా తీసుకొని శుద్ధి చేసి ముక్కు, నోటికి అందిస్తుంది. డిజైన్ పరంగా ముఖానికి ధరించడానికి సులభంగా ఉంటుందని, ఎయిర్-ప్యూరిఫైయింగ్ హెడ్‌ఫోన్‌ లాంచ్ వివరాలు, ఇతర ఫీచర్లు త్వరలోనే వెల్లడిస్తామని కంపెనీ తెలిపింది.



Tags:    

Similar News