Dulquer Salmaan : నేను తీసిన సినిమాల్లో ఇది విభిన్నం.. ‘లక్కీ భాస్కర్' సినిమాపై డైరెక్టర్ కామంట్స్

‘సీతా రామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్.

Update: 2024-10-11 14:42 GMT

దిశ, సినిమా: ‘సీతా రామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఇప్పుడు ఆయన ‘లక్కీ భాస్కర్’ అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (Sitara Entertainments), ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ (Fortunefour Cinemas) పతాకాలపై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamshi), సాయి సౌజన్య (Sai Sowjanya) నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) మాట్లాడుతూ.. ‘మా సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ నెల 21వ తేదీన ట్రైలర్ విడుదల చేయబోతున్నాం. అప్పటినుంచి ప్రమోషన్స్ జోరు మరింత పెంచుతాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటిదాకా నేను తీసిన సినిమాల్లో ఇది విభిన్న చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నాను’ అన్నారు. ఇక నిర్మాత నాగవంశీ (Nagavanshi) మాట్లాడుతూ.. ‘అక్టోబర్ 26 లేదా 27 తేదీల్లో ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నాము. అక్టోబర్ 30 నుంచి ప్రీమియర్లు ప్రదర్శించనున్నాము. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాము. అందుకే ముందు రోజు సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించాము’ అని తెలిపారు.


Similar News