డైట్​చార్జీలు డబుల్ పెంపు

ప్రభుత్వాసుపత్రుల్లో పేషెంట్లు, డాక్టర్లకు ఇచ్చే డైట్​చార్జీలను ప్రభుత్వం పెంచింది.

Update: 2022-03-21 16:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వాసుపత్రుల్లో పేషెంట్లు, డాక్టర్లకు ఇచ్చే డైట్​చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు హెల్త్​ సెక్రటరీ రిజ్వీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం పెట్టడానికి ఒక్కో పేషెంట్‌కు రూ.40 చొప్పున ప్రస్తుతం కాంట్రాక్టర్​ కు చెల్లిస్తుండగా, దాన్ని రూ. 80కి పెంచారు. ఇక టీబీ, ఎయిడ్స్‌, కేన్సర్, మానసిక సమస్యలతో బాధపడుతున్న పేషేంట్ల భోజన చార్జీని రూ.56 నుంచి రూ.112 చేశారు. డ్యూటీ డాక్టర్లకు పెట్టే భోజనానికి ప్రస్తుతం రూ.80 చెల్లిస్తుండగా, దీన్ని రూ.160కి పెంచారు. అయితే సాధారణ రోగుల కంటే డాక్టర్లకు ఏకంగా రెట్టింపు స్థాయిలో డైట్​ చార్జీలను పెంచడం గమనార్హం.

ఏళ్ల క్రితం నాటి డైట్​చార్జీలతో ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన ఆహారం అందట్లేదు. ఇటీవల మంత్రి హరీష్​రావు అనేక ఆసుపత్రుల్లో ఈ సమస్యను గుర్తించారు. ఆహారంపై కాంట్రాక్ట్‌ను ప్రశ్నించగా, ప్రభుత్వం అతి తక్కువగా చెల్లిస్తున్నదని, ఈ ధరతో క్వాలిటీ ఫుడ్​ఇవ్వలేమని కాంట్రాక్టర్లు తేల్చేశారు. దీంతో డైట్​చార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

Tags:    

Similar News