Parents helping tips: పిల్లల్ని ఎగ్జామ్స్ భయం నుంచి బయటపడేయాలనుకుంటున్నారా.. హెల్పింగ్ టిప్స్ ఇవే?

సాధారణంగా చాలా మంది పిల్లలు పరీక్షలు అనగానే తెగ భయపడిపోతుంటారు.

Update: 2025-01-07 13:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చాలా మంది పిల్లలు పరీక్షలు(Tests) అనగానే తెగ భయపడిపోతుంటారు. ఆందోళన, కంగారు పడుతుంటారు. ఓ వైపు కొంతమంది పిల్లల పేరెంట్స్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రాకపోతే తిడుతారేమోనని భయపడుతుంటారు. అదే భయంతో పరీక్షలు రాస్తుంటారు. మరో వైపు స్కూల్(School) యాజమాన్యం కూడా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తారు. అయితే పిల్లలకు ఎగ్జామ్స్ భయం తొలగిపోయి.. సానుకూల వాతావరణం సృష్టించాలంటే..వారిలోని భయం పోయి స్టడీపై ఇంట్రెస్ట్ పెట్టాలంటే ఈ టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కువగా మానసికంగా ఒత్తిడికి గురిచేయొద్దు. పదే పదే చదవమని.. క్లాస్ ఫస్ట్ రావాలంటూ ఫోర్స్ చేయకూడదు. ఎగ్జామ్స్ అప్పుడు పిల్లల సమస్యలు వినండి. వారిని ఫ్రెండ్స్ తో మాట్లాడనివ్వండి. పలు సలహాలు ఇవ్వడం మేలు. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. పిల్లలకు అభ్యసన వాతావరణం సృష్టించండి. స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచి.. ధ్యానం వంటివి నేర్పించండి. చదువుకునేటప్పుడు మధ్యలో బోర్ అనిపిస్తే వారితో పేరెంట్స్ కాసేపు మాట్లాడండి. అలాగే తమ స్టడీ ప్లేస్‌లో వెలుతురు, గాలి ఉండేలా చూడండి. స్టడీ చైర్ ను కూడా వారికి కంపార్ట్‌గా ఉండేలా చూసుకోండి.

పిల్లల, బలాలు, బలహీనతలు దృష్టిలో ఉంచుకుని.. వారి సామర్థ్యానికి తగ్గ టైమ్ టేబుల్ తయారు చేయండి. చివరి నిమిషంలో కంగారు పడకుండా.. ఫస్టే ప్రిపేర్ చేయించాలి. ఇవన్నీ పిల్లలతో చేయించాక.. అయినా ఎగ్జామ్స్ అంటే భయపడితే వైద్యుడ్ని సంప్రదిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. కౌన్సిలింగ్, చికిత్స వంటి చేయించడం బెటర్ అని అంటున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News