Devara: దేవరలో ఎన్టీఆర్ తో పాటు పెళ్లిలో డ్యాన్స్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా?

ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Update: 2024-10-22 03:49 GMT

దిశ, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. రాజమౌళితో సినిమా తీశాక తర్వాత మూవీ ఫ్లాప్ పక్కా అన్న టాలీవుడ్ సెంటిమెంట్‌ కు ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు.ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. పార్ట్ 1 ఇలాగా ఉంటే ఇక పార్ట్ 2 ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. దేవరాలో యాక్షన్ సీన్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ ఇలా చాలా మంది నటీ నటులు నటించారు.

ఇదిలా ఉండగా, దేవర మూవీలో ఎన్టీఆర్ తో కలిసి కళ్లు లేని ఓ అమ్మాయి పెళ్లిలో డాన్స్ చేసింది.. అయితే, ఇప్పుడు చాలా మంది ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ సీన్ లో ఆమె వచ్చి డ్యాన్స్ చేయడం సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఆ స్పెషల్ రోల్ లో నటించిన ఆ అమ్మాయి గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఈ ముద్దుగుమ్మ పేరు ప్రిన్సీ గార్జి.. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. చాలా సినిమాల్లో ఆర్టిస్ట్ గా నటించింది. ఇక దేవర మూవీలో స్పెషల్ రోల్ కనిపించి అందర్ని అలరించింది. కళ్లు కనిపించని అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియా అకౌంట్ కోసం జనాలు తెగ వెతుకుతున్నారు. ప్రస్తుతం ప్రిన్సీ గార్జి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Full View

Tags:    

Similar News