దోమల బెడదను తట్టుకోలేక పోతున్నారా.. అయితే ఈ పండుతో తరిమికొట్టేయండి!
సీజన్‌తో సంబంధం లేకుండా దోమల(mosquitoes) బెడద బాగా పెరిగిపోతుంది. ఇవి ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రదేశంలో, చెత్త ఎక్కువగా పేరుకుపోయిన ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటాయి.
దిశ, ఫీచర్స్: సీజన్‌తో సంబంధం లేకుండా దోమల(mosquitoes) బెడద బాగా పెరిగిపోతుంది. ఈ దోమలు ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రదేశంలో, చెత్త ఎక్కువగా పేరుకుపోయిన ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు.. దోమలు మాత్రం వచ్చేసి కుట్టి పలు సమస్యలను తీసుకువస్తాయి. ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు.
అయితే దోమల బెడద వల్ల డెంగ్యూ(dengue), మలేరియా(malaria) వంటి విష జ్వరాలు వ్యాపించి ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ దోమల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మార్కెట్లో దోమలను తరిమికొట్టేందుకు పలు ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. కానీ వాటిని వాడడం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అరటిపండు(banana)తో ఈజీగా దోమలను తరిమి కొట్టేయండి.
అరటి తొక్కలను ఇలా ఉపయోగిస్తే దోమలు పరార్..
నిద్రపోవడానికి ఒక గంట ముందు అరటి తొక్కలను గదిలోని నాలుగు మూలలో ఉంచాలి. అరటి తొక్కల నుంచి వచ్చే వాసన దోమలను తరిమి కొట్టడానికి పనిచేస్తుంది. అయితే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా, శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసం ఉన్నవారు ఉంటే, రసాయన ఆధారిత ఉత్పత్తులకు బదులుగా ఈ టిప్ ట్రై చేయడం బెస్ట్ అని చెప్పవచ్చు. ఇంట్లో ఏ ప్రాంతంలోనైనా దోమల బెడద ఎక్కువగా ఉంటే అక్కడి నుంచి వాటిని తరిమికొట్టడానికి అరటి తొక్కలను లేదా వాటిని పేస్ట్ చేసి స్ప్రే చేసినా మంచి ప్రయోజనాలు ఉంటాయి.
దీని వాసన దోమలను చాలా వరకు తగ్గిస్తుంది. అరటి పండు తొక్కలను బయటపడేసే కన్నా వాటిని ఉపయోగించడం వల్ల దోమలను బయటికి పంపించేయవచ్చు. అరటి తొక్కలను కాల్చడం ద్వారా కూడా దోమల సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. కానీ అరటి తొక్కలను కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ తొక్కలను ఎండబెట్టి కాల్చండి. అలా కాసేపు ఆ పొగను గదిలోనే ఉండేలా చూసుకోండి. దాని నుంచి వచ్చే వాసనకు దోమలు పారిపోతాయి.