మహిళలు మూత్ర విసర్జన తప్పుగా చేస్తున్నారా? సరైన విధానం ఇదే!

దిశ, ఫీచర్స్ : రోజువారీ లైఫ్‌స్టైల్‌ యాక్టివిటీస్‌లో ఒక్కో పనిని పర్టిక్యులర్ సీటింగ్ పొజిషన్స్‌లోనే చేయాలని, లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు చెబుతుంటారు..Latest Telugu News

Update: 2022-06-20 08:53 GMT

దిశ, ఫీచర్స్ : రోజువారీ లైఫ్‌స్టైల్‌ యాక్టివిటీస్‌లో ఒక్కో పనిని పర్టిక్యులర్ సీటింగ్ పొజిషన్స్‌లోనే చేయాలని, లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు చెబుతుంటారు. అలాగే మూత్ర విసర్జన సమయంలో స్త్రీలు సరైన పొజిషన్‌ అనుసరించడం లేదని, దీనిపై కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉందని యూఎస్ డాక్టర్, వెజీనకాలజిస్ట్ థెరెసా ఇర్విన్ చెప్పారు. సాధారణంగా మహిళలు వాష్ రూమ్‌కు వెళ్లినపుడు స్టిఫ్‌గా ఉండకుండా, కౌబాయ్ మాదిరిగా ముందుకు వంగి బాడీని రిలాక్స్ మోడ్‌లో ఉంచాలని ఆమె సూచించారు. ఇందుకు సంబంధించిన థియరీని తన టిక్‌టాక్‌ వీడియో ద్వారా వివరించారు.

మూత్ర విసర్జనకు సంబంధించిన సరైన పొజిషన్‌ను తన వీడియోలో చూపించింది డాక్టర్ థెరెసా. ఇందుకోసం ఒకటి కంటే ఎక్కువ మార్గాలున్నాయని వెల్లడిస్తూ.. తెల్లటి కుర్చీపై కూర్చుని పొజిషన్స్ గురించి వివరించింది. నిటారుగా కూర్చున్న స్థితిలో మూత్ర విసర్జన చేస్తే మూడింట ఒక వంతు యూరిన్ మూత్రాశయంలోనే ఉండిపోతుందని చెప్పింది. కాబట్టి మూత్ర విసర్జనకు కౌబాయ్ పొజిషన్ సరైన మార్గమని తెలిపింది. ముందుకు వంగి, మోచేతులను మోకాళ్లపై ఉంచి మూత్ర విసర్జన చేయాలని, ఈ సమయంలో పాదాలు ఫ్లాట్‌గా ఉండేలా చూసుకోవాలని లేదంటే మూత్రాశయం సరిగ్గా ఖాళీ అవదని పేర్కొంది. ఇక డాక్టర్ ఇర్విన్ గురించి చెప్పాలంటే ఆమె పెల్విక్ హెల్త్(కటి ఆరోగ్యం), ఇన్‌కాంటినెన్స్(ఆపుకొనలేని స్థితి) చికిత్సలో స్పెషలిస్ట్. జనాలు పట్టించుకోని ఇలాంటి సాధారణ విషయాల గురించి ఆమె తరచుగా TikTok వీడియోలు చేస్తుంటుంది.






Similar News