ఐష్‌తో విడాకులు.. ఆ హీరోయిన్‌ను ప్రశంసలతో ముంచెత్తిన అమితాబ్.. ఇక కోడలు అయ్యేది ఖాయమే అంటున్న నెటిజన్లు
బాలీవుడ్ స్టార్ కపూల్ ఐశ్వర్యరాయ్(Aishwarya Rsi)- అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan)లు విడాకులు తీసుకోబోతున్నారంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కపూల్ ఐశ్వర్యరాయ్(Aishwarya Rsi)- అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan)లు విడాకులు తీసుకోబోతున్నారంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే నిమ్రత్ కౌర్(Nimrat Kaur)తో డేటింగ్‌లో ఉండటం వల్లనే అభిషేక్ ఐష్‌కి డివోర్స్ ఇస్తున్నాడని, త్వరలో అభిషేక్, నిమ్రత్ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పలు పుకార్లు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో నిమ్రత్ కౌర్‌ను ప్రశంసిస్తూ అమితాబ్ బచ్చన్(Amitab Bachchan) తన దస్తూరితో రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'మనం కలుసుకున్నది, మాట్లాడుకున్నది చాలా తక్కువ. క్యాడ్‌బరీ యాడ్ కోసం యష్‌రాజ్ ఫిల్మ్స్‌లో నిన్ను కలిసిన సమయంలో కాంప్లిమెంట్ ఇచ్చినట్టు ఉన్నాను. అయితే, ‘దస్వి’(Dasvi) మూవీలో నీ నటన అత్యద్భుతం. నీ హావభావాలు, నటన, అన్నీ బాగున్నాయి. నీకు నా ప్రత్యేక అభినందనలు' అంటూ అమితాబ్ బచ్చన్ లేఖ రాశారు. అయితే ఈ ప్రశంసలపై నిమ్రత్ కౌర్ స్పందించింది. '18 సంవత్సరాల కిందట ముంబయిలో సెట్‌లోకి తొలిసారి అడుగుపెట్టాను. అప్పుడే అమితాబ్ బచ్చన్ గారికి ఓ రోజు నా పేరు తెలుస్తుంది.
ఆయన్ని నేను కలవాలని కోరుకున్నాను. ఓ యాడ్ షూట్‌లో కలిసి నటించిన తర్వాత అమితాబ్ గారు ప్రశంసించారు. కొన్నేళ్ల తర్వాత ఇలా నోట్, ఫ్లవర్స్ పంపడం నా కెరీర్‌లో మరిచిపోలేని సందర్భం. నా కల నెరవేరినట్టుగా ఉంది. మీరు చూపించిన ఆదరణకు ఎలా ధన్యవాదాలు తెలుపుకోవాలో అర్థం కావడం లేదు. మీ ఉత్తరం నన్ను ప్రతిక్షణం, అనునిత్యం స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది. మీకు పంపిన బొకే పరిమళం, నా జీవితంలో ప్రతీ అడుగులోనూ గుభాళిస్తుంది' అంటూ నిమ్రత్ కౌర్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా నెటిజన్లు.. ఇక నిమ్రత్ అభిషేక్ బచ్చన్ భార్యగా రెండో కోడలు అయ్యేది ఖాయమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.