కాంగ్రెస్‌ను రెండుగా చీల్చొద్దు: మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం

న్యూఢిల్లీ : దేశంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోవడం, ఇటీవల జరిగిన..telugu latest news

Update: 2022-03-17 16:34 GMT

న్యూఢిల్లీ : దేశంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోవడం, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి గాంధీలే కారణమని జీ 23 సీనియర్ లీడర్స్ ఆరోపించడాన్ని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం తప్పుబట్టారు. కాంగ్రెస్‌ను రెండుగా చీల్చొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట‌మికి గాంధీ కుటుంబాన్ని మాత్రమే బాధ్యుల్ని చేయ‌డం సరికాదన్నారు. ఓటమికి కాంగ్రెస్‌లోని ప్రతిఒక్కరూ బాధ్యత వహించాల్సిందేనని.. ఎవరూ తప్పించుకుని పారిపోలేరని మండిపడ్డారు. ఓట‌మికి తాము బాధ్యత వ‌హిస్తున్నామ‌ని గాంధీ కుటుంబం ప్రక‌టించిందని గుర్తుచేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ఓట‌మికి తానూ బాధ్యత వ‌హిస్తున్నట్టు చిదంబరం పేర్కొన్నారు.

ఐదు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన వెంటనే ఆయా రాష్ట్రాల పీసీసీ ఇంచార్జులను రాజీనామా చేయాలని సోనియా గాంధీ ఆదేశించిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆగస్టులో ఉండే అవకాశం ఉందన్నారు. కాగా, ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓటమి చెందుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధినాయకత్వాన్ని ఎంపిక చేయాలని, గాంధీలు ఇక నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని జీ 23 గ్రూప్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ఇంట్లో రెబల్ లీడర్స్ అంతా భేటీ అయ్యారు. ఈ గ్రూపులో సభ్యులైన కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, మనిష్ తివారీ, శశి థరూర్ లాంటి వాళ్లు కూడా కాంగ్రెస్ అధినాయకత్వాన్ని తప్పుబట్టడంతో పాటు నాయకత్వ మార్పును కోరుతున్న వారి జాబితాలో ఉన్నారు.

Tags:    

Similar News