Zebra: ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి.. ‘జీబ్రా’పై డైరెక్టర్ కామెంట్స్

టాలెంటెడ్ హీరో సత్య దేవ్ (Satya Dev), కన్నడ స్టార్ డాలీ ధనంజయ (Kannada Star Dolly Dhananjaya) హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ చిత్రం ‘జీబ్రా’ (zebra).

Update: 2024-11-18 15:39 GMT

దిశ, సినిమా: టాలెంటెడ్ హీరో సత్య దేవ్ (Satya Dev), కన్నడ స్టార్ డాలీ ధనంజయ (Kannada Star Dolly Dhananjaya) హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ చిత్రం ‘జీబ్రా’ (zebra). ఈ మూవీ పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తుండగా.. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ (teaser), ట్రైలర్ (Trailer) హ్యుజ్ క్రియేట్ చేశాయి. జీబ్రా నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ మీడియాతో ముచ్చటించారు.

‘జీబ్రా కొత్త వరల్డ్. కమర్షియల్ ఎలిమెంట్స్ (Commercial Elements)తో పాటు ఆర్టిస్టిక్ ఎలిమెంట్స్‌ని బ్లెండ్ చేయడం కొన్ని కథలకే కుదురుతుంది. జీబ్రాలో అది కుదిరింది. ఇందులో అన్ని ఎమోషన్స్ (emotions) ఆర్గానిక్‌గా బ్లెండ్ అయ్యాయి. మాస్ ఎలిమెంట్స్, బ్యాంకింగ్ జోనర్, మనీ లాండరింగ్, కామెడీ, లవ్, ఫ్రెండ్షిప్, యాక్షన్ ఇవన్నీ బాగా బ్లెండ్ అయ్యాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. నా దగ్గర ఉన్న స్టొరీ ఐడియాస్ (Story Ideas) కొత్త కాన్సెప్ట్‌తో ఉంటాయి. ఒక కథ చేయాలంటే ముందు నేను కన్విన్స్ అవ్వాలి. బ్యాంకింగ్ వరల్డ్‌లో కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. అవి లైమ్ లైట్‌లో పెట్టి ఆడియన్స్‌కి చూపించాలనే ఆలోచన వచ్చింది. బ్యాంకింగ్, మనీ లాండరింగ్ ఇలా రెండు వరల్డ్స్ బ్లెండ్ చేసి ఈ కథ రాశాను. జీబ్రా స్క్రీన్ ప్లే ఇంటెల్జెంట్‌గా ఉంటుంది. అలాగే రైటింగ్ సింపుల్ అండ్ బ్యూటీఫుల్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది’ అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News