అనస్థీషియాను తొలిసారి ప్రయోగించినది ఎప్పుడో తెలుసా?
దిశ, ఫీచర్స్:1842లో ఇదే రోజు మెడికల్ హిస్టరీలో గ్రేట్ టైమ్‌గా అవతరించింది. సర్జికల్ ఈథర్ అనస్థిటిక్.. Latest Telugu News..
దిశ, ఫీచర్స్:1842లో ఇదే రోజు మెడికల్ హిస్టరీలో గ్రేట్ టైమ్‌గా అవతరించింది. సర్జికల్ ఈథర్ అనస్థిటిక్ ఇచ్చిన మొదటి రోజుగా చరిత్రలో నిలిచిపోయింది. జేమ్స్ ఎం వెనెబుల్ అనస్థీషియా తీసుకున్న మొదటి వ్యక్తి కాగా, మెడ భాగంలోని కణతిని తొలగించే ప్రక్రియలో మత్తుమందు తీసుకునేందుకు అతడు అంగీకరించాడు. అంతేకాదు అనస్థీషియా ఇచ్చిన డాక్టర్ లాంగ్‌కు ఈయన క్లోజ్ ఫ్రెండ్ కావడం విశేషం. 1800 సంవత్సరంలో ఇంగ్లీష్ కెమిస్ట్ హంఫ్రీ డేవీ ప్రిస్క్రైబ్ చేసిన నైట్రస్ ఆక్సైడ్‌ను పోలిన ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ డై ఇథైల్ ఈథర్‌లోనూ ఉండటంతో మత్తుమందుగా ఎంచుకున్నట్లు చరిత్ర చెబుతోంది.