జాన్వీ కపూర్ పెళ్లి అక్కడే.. సౌత్ ఇండియన్ ఫుడ్‌తో పెద్ద దావత్

దిశ, సినిమా : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఫ్యూచర్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్ ఇప్పటికే ఫిక్స్ చేసింది..Latest Telugu News

Update: 2022-06-22 07:43 GMT

దిశ, సినిమా : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఫ్యూచర్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్ ఇప్పటికే ఫిక్స్ చేసింది. దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్య తిరుపతిలో పెళ్లి చేసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో తెలిపిన ఆమె.. అదే తనకు సంతృప్తినిస్తుందని తెలిపింది. బిగ్ అండ్ ఫ్యాన్సీ వెడ్డింగ్స్ అవసరం లేదన్న జాన్వి.. తన పెళ్లి సాంప్రదాయ పద్ధతిలో కచ్చితంగా తిరుపతిలోనే జరుగుతుందని చెప్పింది. ఆ తర్వాత సౌత్ ఇండియన్ ఫుడ్‌తో ఫుల్ దావత్ ఉంటుందని వివరించింది. ఇడ్లీ, సాంబార్, పెరుగన్నం, ఖీర్ అంటే తనకు చాలా ఇష్టమని.. అవి కూడా మెనూలో ఉంటాయని చెప్పుకొచ్చింది జాన్వి.


Similar News