పోలీసులు అలా చేస్తే కాల్ చేయండి.. ప్రజలకు కమిషనర్ సూచన

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో గంజాయి నివారణ కోసం ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే పోలీసులు అనేక విధాలు

Update: 2022-04-05 05:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో గంజాయి నివారణ కోసం ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే పోలీసులు అనేక విధాలుగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు వాహనదారుల మొబైల్ ఫోన్‌లను చెక్ చేస్తున్నారు. దీనిని అనేక మంది తప్పుబట్టారు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదు. అయితే తాజాగా బెంగళూరు కమిషనర్ దీనిపై దృష్టి పెట్టారు. ఎవరైనా పోలీసులు మీ ఫోన్‌ చెక్ చేస్తే వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చేయండంటూ ప్రకటించారు.

దీనిపై బెంగళూరు కమిషనర్ కమల్ పంత్ మాట్లాడుతూ.. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏ పౌరుడి ఫోన్‌ను తనిఖీ చేసే అధికారుల పోలీసులకు లేదని ఆయన అన్నారు. అయితే ఎవరైనా పోలీసులు మీ ఫోన్‌ను తనిఖీ చేస్తే 112 లేదా 080-22942215 కు కాల్ చేయాలని ప్రజలకు తెలిపారు. అంతేకాకుండా ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయిని తెలిపారు. ఒకవేళ ఫోన్ చేయలేకపోతే మీ ఫోన్ చెక్ చేసిన సమయం, లొకేషన్‌ను డీఎం చేస్తే చాలని మిగతా పని తాము చూసుకుంటామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News