కీలక నిర్ణయం తీసుకున్న ధోని.. చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు అతనికే..

దిశ, వెబ్ డెస్క్: IPL 2022: MS ధోని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ 15వ సీజన్ లో చెన్నై latest telugu news..

Update: 2022-03-24 10:26 GMT

దిశ, వెబ్ డెస్క్: IPL 2022: MS ధోని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ 15వ సీజన్ లో చెన్నై టీం కెప్టెన్సీ బాధ్యతలు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అప్పగించాడు. 2008 ప్రారంభ సీజన్‌లో CSK ఐకాన్ ప్లేయర్ గా ధోని ని ఆ జట్టు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ధోని 12 సీజన్లో మొత్తం 10 సార్లు ప్లే-ఆఫ్‌లకు తీసుకుపోగా... నాలుగు టైటిల్స్ ను చెన్నై జట్టుకు సాదించాడు. ధోని సారద్యంలో మొత్తం ఐపీఎల్ సీజన్‌లలో ఒక సీజన్‌లో తప్ప ప్రతి సీజన్‌లో ప్లే-ఆఫ్‌లకు అర్హత సాదించింది. 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడుతున్న జడేజా చెన్నై కి నాయకత్వం వహించే మూడవ ప్లేయర్ జడేజా. అయితే ధోని ఈ సీజన్ తో పాటు వచ్చే సీజన్‌లలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తాడని.. టీమ్ ప్రాంఛైజీ స్పష్టం చేసింది.

రవీంద్ర జడేజా IPL మొత్తంలో 200 మ్యాచ్ లు ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ తరపున వరుసగా 2386 పరుగులు చేశాడు. అలాగే 127 వికెట్లు తీశాడు. జడేజా ప్రస్తుతం ICC ఆల్ రౌండర్ ర్యాంకింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. జడేజా 2016-17 లో చైన్నై పై బ్యాన్ విధించినప్పుడు తప్ప మిగిలిన అన్ని ఐపీఎల్ సీజన్‌లలో జడేజా ధోని సారధ్యంలోనే కోనసాగాడు.

Tags:    

Similar News